16వ నెంబరు జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణకు ప్రణాళికలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:47 AM
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 17(ఆంధ్ర జ్యోతి): జిల్లా సత్వరాభివృద్ధి, ప్రజల జీవన వికా సానికి దోహదం చేసే 16వ నెంబరు జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణకు ప్రణాళికలు రూ పొందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మో హన్ హైవేస్ అథారిటీ అధికారులను ఆదేశించా రు. కాకినాడ కలెక్టరేట్
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్
ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో స్టేక్‌హోల్డర్స్ సమావేశం
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 17(ఆంధ్ర జ్యోతి): జిల్లా సత్వరాభివృద్ధి, ప్రజల జీవన వికా సానికి దోహదం చేసే 16వ నెంబరు జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణకు ప్రణాళికలు రూ పొందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మో హన్ హైవేస్ అథారిటీ అధికారులను ఆదేశించా రు. కాకినాడ కలెక్టరేట్‌లో బుధవారం ఎన్‌హెచ్ 16 జాతీయ రహదారిని ఆరులైన్ల విస్తరణ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో వివిధ అలైన్‌మెంట్ ఆప్షన్లతో సిద్ధం చేసిన డిటైల్డ్ ప్రా జెక్టు రిపోర్టుపై ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో స్టేక్‌హోల్డర్స్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగు లైన్ల రహదా రిగా ఉన్న దీన్ని ఇరువైపులా విస్త రించి 60మీటర్ల వెడల్పుకు పెం చుతామన్నారు. వంపులు సరిచేయ డానికి, జనా వాసాలను తప్పించ డానికి అవసరమైన చోట్ల 60 మీటర్ల వెడల్పులో బైపాస్‌రోడ్లు ప్రతిపాదించామన్నారు. ప్రజల సౌకర్యం కోసం అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, సర్వీసురోడ్లు అలైన్‌మెం ట్‌లో ప్రతిపాదించామన్నారు.
అలైన్మెంట్‌లతో డీపీఆర్‌కు రూపకల్పన
నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్‌కుమార్ మాట్లాడుతూ జాతీయరహదారి విస్తరణలో భాగంగా అనకా పల్లి నుంచి అన్నవరం మీదుగా దివాన్‌చెరువు వరకు 741.255 కిలోమీటర్లు నుంచి 903.00 కిలో మీటర్ల వరకు ఉన్న నాలుగులైన్ల రోడ్డును ఆరు లైన్ల పాక్షిక యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేసేందుకు వివిధ అలైన్మెంట్‌లతో డీపీఆర్ రూ పొందించామన్నారు. ప్రతిపాదిత ఆరులైన్ల రహ దారి విస్తరణలో అనకాపల్లి, కసింకోట, యల మంచిలి, పాయకరావుపేట మండలాల్లో 68.645 కిలోమీటర్లు, కాకినాడ జిల్లాలోని తుని, శంఖవ రం, తొండంగి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఏలేశ్వరం, గండేపల్లి మండలాల్లో 80.600 కిలోమీటర్లు నిర్మిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలో 11 కిలో మీటర్లు ప్రతిపాదించామన్నారు. మొత్తంగా 160 కిలోమీటర్లు మేరకు నిర్మించాలన్నారు. విస్తరణ లో భూసేకరణ, నిర్మాణ వ్యయం, జనజీవనం, ర హదారిపై కట్టడాలు, ఫ్లైఓవర్‌లు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.
మార్పులు సూచించిన ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య, వరుపుల సత్యప్రభ, నిమ్మకాయల చినరాజప్ప తమ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన రోడ్డులో అవసరమైన మార్పులు సూచించారు. జాతీయ రహదారి అంతా సౌరశక్తితో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల కోరారు. ఎన్‌హెచ్ 16, ఏడీబీ రోడ్లు కలిసే చోట రాజానగరం కూడలిలో ట్రంపెట్ కనెక్షన్ నిర్మించాలని ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు. ధర్మ వరం వద్ద జాతీయ రహ దారి పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటేందుకు అండర్‌పాసులు ఏర్పాటు చేయాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ సూచించారు. తొండంగి వైపున సర్వీసు రోడ్డు నిర్మించాలని తుని ఎమ్మెల్యే దివ్య సూచించారు. సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, డీఆర్వో వెంక ట్రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కంఠు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ప్రసాద్, పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి పాల్గొన్నారు.