రియల్ ఛాన్స్!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:22 AM
తక్కువ ధరకు భూమి వస్తుందని ప్లాటైపోతారు.. పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తారు.. తీరా ఇల్లు కట్టుకుందామంటే అనుమతులు రావు.. అప్పుడు ఆరా తీస్తే అనధికార లేఅవుట్ అని తేలుతుంది..
రుడా పరిధిలో 300పైనే లేఅవుట్లు
తక్కువ ధరకు స్థలాల కొనుగోళ్లు
నాన్‌లేఅవుట్లని తెలిశాక లబోదిబో
అందుబాటులోకి ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్
మరో 2 నెలల వరకూ అవకాశం
జూన్30లోపు లేఅవుట్లకే వర్తింపు
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
తక్కువ ధరకు భూమి వస్తుందని ప్లాటైపోతారు.. పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తారు.. తీరా ఇల్లు కట్టుకుందామంటే అనుమతులు రావు.. అప్పుడు ఆరా తీస్తే అనధికార లేఅవుట్ అని తేలుతుంది.. ఎంత ప్రయత్నించినా అనుమతులు రాక లబోదిబో మంటారు.. అటువంటి ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది.. అదే ఎల్‌ఆర్‌ఎస్.. ఈ స్కీమ్‌లో కొంత మొత్తం చెల్లించి ప్లాట్ క్రమబద్ధీకరించుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం..రియల్ ఛాన్స్ ఉపయోగించుకోండి. తెలిసో..తెలియకో అనధికార లేఅవుట్లలో రూ.ల క్షలు పోసి ప్లాట్లు కొనుగోలు చేస్తారు.. ఆ ప్లాట్లలో ఏమైనా నిర్మాణాలు చేద్దామంటే అనుమతులు లభిం చవు. దీంతో వేలాది మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా సతమతమవుతున్న వారికి ప్రభుత్వం ఒక అవ కాశం ఇచ్చింది. అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణకు (ఎల్‌ఆర్‌ఎస్) స్కీమ్‌ను ముందుకు తెచ్చింది. ఈ మేరకు జూలై 26వ తేదీన జీవో జారీ చేసింది. 90 రోజుల్లో ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవాలనే నిబం ధన ఉంది. ఇప్పటికే నెలరోజులైంది. ఇక సుమారు రెండు నెలల్లోపే గడువు ఉంది. అయితే స్పందన అం తగా లేకపోవడంతో రాజమహేంద్రవరం అర్బన్ డెవ లప్‌మెంట్ అథారిటీ (రుడా) అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు.గత జూన్ 30లోపు అనధికార లే అవుట్లు, ప్లాట్లుగా ఉన్నవాటికి ఈ స్కీమ్ వర్తిస్తుంది.
అనధికార ప్లాట్లు అంటే..?
ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు తీసు కోకుండా ఏదైనా భూమిని ప్లాట్లుగా విభజించి విక్ర యించేస్తారు. సాధారణంగా లేఅవుట్ వేయాలంటే 10 శాతం కామ న్ సైట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎకరం లేఅవుట్ వేస్తే దానిలో 10 సెంట్లు కామన్ సైట్‌గా వదిలే యా లి. రోడ్లు నిబంధనలకు తగినట్టు ఏర్పాటు చేయాలి. లేఅవుట్ వేయడానికి ముందు పొలానికి కన్వర్షన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత నిబంధనల మేరకు లేఅవుట్ విభజించి డీటీసీపీ అనుమతులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా చేస్తేనే అది లేఅవుట్ లెక్కలోకి వస్తుంది. ఈ వ్యవహారం అంతా ఖర్చుతో కూడుకున్న పనికావడం తో రాజకీయ పలుకుబడి ఉన్న రియల్టర్లు కనీస అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేసేస్తారు. వీటినే అనధికార లేఅవుట్లు అంటారు. ఈ లేఅవుట్‌లో ప్లాట్ తీసుకుంటే పంచాయతీ అయినా.. పట్టణంలో అయినా భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. ఆ లేవుట్‌లో మౌలిక వసతులపై దృష్టి పెట్టరు. దీంతో భూమి తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసినా ఆ తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
రుడాలో 300పైనే అనధికారం
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అఽథా రిటీ (రుడా) పరిధిలో 390 గ్రామాలు ఉన్నాయి. వాటి పరిఽధిలో గతంలో ఆన్‌లైన్‌లో సేకరించిన వివ రాల ప్రకారం 300పైనే అనధికార లేఅవుట్లు ఉ న్నాయి. వాటి సంఖ్యను వాస్తవంగా సేకరించే ప్రయ త్నంలో అధికారులు ఉన్నారు.ఈ నేపథ్యంలో పంచా యతీ కార్యదర్శులను అనధికార లేఅవుట్ల వివ రాలు ఇవ్వాలని ఆదేశించారు. వాస్తవానికి 2020లో ఎల్‌ఆర్‌ఎస్ జీవో వచ్చింది. 2019 ఆగస్టు 31వ తేదీ లోపు రిజిస్టర్ చేసుకున్న ప్లాట్లకు అది వర్తించేలా జీవో ఇచ్చారు.కానీ అప్పటికి సుమారు 3 వేల దరఖా స్తులు వచ్చాయి.అవన్నీ పరిష్కారం కాలేదు. క్రమం గా 2వేల దరఖాస్తులు పరిష్కరించారు. మరో 1000 వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు 2025 జూన్ 30వ తేదీలోపు రిజిస్టర్ చేసుకున్న అనధికార ప్లాట్లకు వర్తించేలా జూలై 26న ప్రభుత్వం జీవో ఇచ్చింది. 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.స్కీమ్ గ్రామాలు, నగర పంచాయ తీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తిస్తుంది.
ఏ ప్లాట్‌కు ఎంత?
అనధికార లేఅవుట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్లకు ఎవరికి వారు ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వర్తింపచేసుకో వ చ్చు. మొత్తం లేఅవుట్ క్రమ బద్ధీకరించుకోవచ్చు. సాధారణంగా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత లేఅవుట్ యజమాని అందుబాటులో ఉండడు. అందువల్ల కొనుగోలు దారులే చేయించుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ ఏరియాను బట్టి పీనలైజేషన్ చార్జీలు నిర్ణయించారు. 100 చదరపు మీటర్ల వరకూ ఒక చదరపు మీటరు చార్జీ రూ.200 చెల్లించాలి. 100 నుంచి 300 చదరపు మీటర్ల వరకూ ఉంటే ఒక్కో చదరపు మీటరుకు రూ.400 చెల్లించాలి. 300 నుంచి 500 చ.మీ వరకూ ఉంటే ఒక్కో చ.మీ.కీ రూ.600 చెల్లించాలి. 500 చ.మీ దాటి ఉంటే ఒక్కో చ.మీ.కి రూ.750 చెల్లించాలి.ఈ చార్జీలన్నీ గత జూన్ 30వతేదీలోపు ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి మార్కెట్ విలు వను బట్టి వర్తిస్తుంది. 3 వేల లోపు చదరపు గజాలకు 20 శాతం, 3 వేల నుంచి 5వేల లోపు వాటికి 30 శాతం, 5001 నుంచి 10 వేల లోపు వాటికి 40 శాతం, 10001 నుంచి 20 వేల వరకూ 50 శాతం, 20001 నుంచి 30 వేల వరకూ 60 శాతం, 30,001 నుంచి 50 వేల వరకూ 80 శాతం, 50 వేల చదరపు గజాలు ఉంటే 100 శాతం పీన లైజేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఆ..లేఅవుట్‌లో ఓపెన్ సైట్ (కామన్‌సైట్) లేకపోతే ప్లాట్ విలువులో 14 శాతం చెల్లించాల్సి ఉంది. అనధికార లేఅవుట్లలో ప్లాట్ కొనుగోలు చేసిన యజమానులు నష్టపోవాల్సి వస్తుంది.అనధికార లేఅవుట్ యజమానిపై చర్య లేమీ ఉండవు.అతడు ప్లాట్లన్నీ అమ్మేసుకుని డబ్బు చేసు కుంటాడు.ఇవి క్రమబ ద్ధీకరిం చుకోవడానికి అవసరమైన డబ్బంతా ప్లాట్ల యజమానులే భరించాలి. అందుకే ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో అనధికార ప్లాట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.