నామినేటేడ్ జోష్
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:33 AM
సార్వత్రిక ఎన్నికలు జరిగి పద్నాలుగు నెలలు గడిచాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎదురుదెబ్బలు తిని నిలబడిన పార్టీ జెండాలు మోసిన నాయకులకు, కార్యకర్తలకు నామినేటేడ్ పదవులు ఒక్కొక్కటిగా దక్కుతున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన అనేక మంది నాయకులకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయి. పదవులు కేటాయింపులో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ముందుగు సాగుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు పదవులు లభించాయి.
రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు పదవులు
మొన్న పలు కార్పొషన్లకు..
తాజాగా ఎండోమెంట్ కమిటీలకు చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులుగా నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 8(ఆంధ్ర జ్యోతి): సార్వత్రిక ఎన్నికలు జరిగి పద్నాలుగు నెలలు గడిచాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎదురుదెబ్బలు తిని నిలబడిన పార్టీ జెండాలు మోసిన నాయకులకు, కార్యకర్తలకు నామినేటేడ్ పదవులు ఒక్కొక్కటిగా దక్కుతున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన అనేక మంది నాయకులకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయి. పదవులు కేటాయింపులో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ముందుగు సాగుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు పదవులు లభించాయి.
రాష్ట్ర స్థాయి పదవులు..
శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్‌గా కుడిపూడి సత్తిబాబు(టీడీపీ), టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గంటా స్వరూప(జనసేన), క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా మంతెన సత్యనారాయణ రాజు(టీడీపీ)లకు అవకాశం లభించింది.
తాజాగా రాజమహేంద్రవరంలో ఎండోమెంట్ కమిటీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపాదించగా కొంతమంది నాయకులను ఆయా బోర్డుల్లో చైర్మన్లు, డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
ఏండోమెంట్ కమిటీల్లో..
రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో 14 ఎండోమెంట్ కమిటీలకు అభ్యర్థుల పేర్లును ఎమ్మెల్యే వాసు ప్రతిపాదించగా వాటి లో నాలుగు కమిటీలకు ప్రభుత్వం ఆయోదం తెలిపింది. మరో నాలుగింటికి కూడా పేర్లు దా దాపు ఖరారయ్యాయి.ఇందులో జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్‌గా దాసరి గురునాధరావ ు(జనసేన), సారంగధరేశ్వరాలయం కమిటీ చైర్మన్‌గా కేవీడీఎస్‌సీవీ చౌదరి(టీడీపీ), కోరుకొండ రోడ్డు శ్రీవల్లి సుబ్రహ్మణేశ్వరాలయ కమిటీ చైర్మన్‌గా యేడిద వీర వెంకట దుర్గాప్రసాద్(జనసేన),గోదావరి బండ్ రోడ్డు నాళం భీమరాజు వీధిలోని విఘ్నేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు(టీడీపీ), నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ చైర్మన్‌గా చింతా జోగినాయుడు(టీడీపీ)ని ఎంపిక చేశా రు. అలాగే పందిరి మహదేవుడు సత్రం చైర్మన్‌గా రెడ్డి మణేశ్వరరావు(టీడీపీ), గోదావరి బండ్ ఉమామార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్‌గా మదన్ సింగ్‌రాజ్ పురోహిత్(టీడీపీ), శ్రామలాంబ దేవస్థానం చైర్మన్‌గా కడియాల వీరభద్రరావులను ప్రతిపాదించారు.ఇంకా వేణుగోపాలస్వామి దేవస్థానం సహా ఆరు కమిటీలను నియమించాల్సి వుంది. అందులో బీజేపీకి ప్రాధాన్యత వుండే అవకాశం ఉంది.
పక్కా ప్రణాళికతో..
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా టీడీపీ ట్రేడ్ విభాగం నేత తవ్వా రాజును, ఆర్యాపురం బ్యాం కు ఎన్నికల్లో చైర్మన్‌గా చల్లా శంకర్రావు ప్యానల్‌ను, జాంపేట కోపరేటివ్ బ్యాంకు ప్యానల్‌ను గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తన నియోజకవర్గంలో కూటమి నేతలకు పదవులను అప్పగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజా ఎండోమెంట్ కమిటీల్లో 140 మందికి అవకాశం కల్పించారు. ఇంకా నగరంలో ప్రతిష్టాత్మక హితకారిణి సమాజం ట్రస్ట్, గౌత మి జీవకారుణ్య సంఘం కమిటీలను నియమించాల్సివుంది.మరో ఏడు నెలల్లో కార్పొరేషన్ ఎన్ని కలు జరిగే అవకాశం ఉన్నందున పక్కా ప్రణా ళికతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు.