కానరాని పారిశుధ్యం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:50 AM
మండలం లోని పలు గ్రామాల్లో అపారిశుధ్యం తాండవి స్తోంది. ఏ వీధి చూసినా, ఏ సందుకెళ్లినా ము రుకు కూపాలు, చెత్త, చెదారాలు కనిపిస్తు న్నాయి. దీంతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
గోకవరంలో దోమల బెడద
వీధుల్లో అపారిశుధ్యం
రోగాల బారిన మండల ప్రజలు
గోకవరం, జూలై 29(ఆంధ్రజ్యోతి): మండలం లోని పలు గ్రామాల్లో అపారిశుధ్యం తాండవి స్తోంది. ఏ వీధి చూసినా, ఏ సందుకెళ్లినా ము రుకు కూపాలు, చెత్త, చెదారాలు కనిపిస్తు న్నాయి. దీంతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే సర్పంచ్‌లు పారిశుధ్య చర్యలు చేపట్టాలనుకున్నా నిధుల లేమితో మిన్నకుండిపోతున్నారు. గత వైసీపీ హయాంలో కేంద్రం నుంచి విడుదలైన నిధులను ఇతర పనులకు మళ్లించింది.
గ్రామాల్లో దోమల వ్యాప్తి
కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు సక్రమైన డ్రైనేజీల సౌకర్యం లేక చాలా గ్రామాల్లో నివాస గృహల మధ్యే వర్షపునీరు నిల్వ ఉండిపోతుంది. దీంతో దోమల బెడద ఎక్కువైంది.పలువురు వై రల్ జ్వరాల బారిన పడుతున్నారు. దీనిని చూ స్తున్న అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. దోమల వ్యాప్తి నివారణకు మందుల పిచికారీ, ఫాగింగ్ వంటి చర్యలు ఎక్కడా కానరావడంలేదు.
తాగునీటి ట్యాంకుల అపరిశుభ్రత
చాలా పంచాయతీల్లో తాగునీటి నిర్వహణ, ట్యాంకుల శుభ్రత నెలల తరబడి జరగడం లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన సంద ర్భంలోను, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో మాత్రమే ట్యాంకులు శుభ్రం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.