సేవలందే దారేది?
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:15 AM
ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ భవనం.. దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకుని సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా.. దాన్ని అందుబాటులోకి తెచ్చే ‘దారి’ మాత్రం కానరావడం లేదు. రూ.15కోట్ల నిధులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా.. ప్రారంభానికి నోచుకునే ‘మార్గం’ కనిపించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ చూపి పరిష్కార చూపేలా ‘రూట్’ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
కాకినాడలో రూ.15కోట్లతో ఆయుష్ ఆస్పత్రి భవనం నిర్మాణం
రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్
నిర్మించి ఏడాది పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం
ఆస్పత్రికి వెళ్లేందుకు దారి లేదు
జీపీటీ కళాశాల అధికారుల అభ్యంతరంతో చిక్కులు
ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ భవనం.. దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకుని సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా.. దాన్ని అందుబాటులోకి తెచ్చే ‘దారి’ మాత్రం కానరావడం లేదు. రూ.15కోట్ల నిధులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా.. ప్రారంభానికి నోచుకునే ‘మార్గం’ కనిపించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ చూపి పరిష్కార చూపేలా ‘రూట్’ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ జిల్లావాసులకు ఆయుర్వేదం(ఏ), యోగా(వై), యునానీ(యూ), సిద్ధా(ఎస్), హోమియోపతి(హెచ్) ఇలా ఐదురకాల వైద్య సేవలు ఒకేచోట అందించే ఉద్దేశంతో పదేళ్ల క్రి తం కాకినాడ వాసి, అప్పటి ఆయుష్ కమిషన ర్ నళినీమోహన్ ఆయుష్ సమీకృత ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని స్థానిక వైద్యులకు మాటిచ్చారు. దీంతో అప్పటి ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు కొందరు స్థలసేకరణకు సిద్ధమయ్యారు. 2015లో అప్పటి జిల్లా ఉన్నతాధికారుల ద్వారా కొండయ్యపాలెం శారదమ్మగుడినుంచి నాగమల్లితోట జంక్షన్‌కు వెళ్లే దారిలో చీడిలపొర డ్రెయిన్‌ను ఆనుకుని 2.54ఎకరాల భూమిసేకరణకు సిద్ధమయ్యారు. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ నిధులు రూ.7.5కోట్లు కూడా విడుదలయ్యాయి. కానీ, ఈ స్థలం నుం చి హైవే రోడ్డు వెళ్లడంతో 70సెంట్లు మాత్రమే మిగిలింది. దీంతో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం సరిపోక పనులు ప్రారంభంకాలేదు. విడుదలైన నిధులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్‌ఐడీసీ) వద్ద ఉండిపోయాయి.
తిరిగి ఏడేళ్ల తర్వాత..
2022, ఫిబ్రవరిలో అప్పటి ఆయుష్ జిల్లా అధికారి బి.జగదీశ్వరరావు, ఇతరులు చొరవ తీసుకుని అప్పటి కాకినాడ ఎంపీ వంగాగీత వద్ద కు విషయాన్ని తీసుకువెళ్లారు. నిధులు సిద్ధం గా ఉన్నాయని, స్థలం చూపిస్తే ఆయుష్ ఆస్ప త్రి నిర్మించవచ్చని ఆమెకు వివరించారు. మ హిళా పాలిటెక్నిక్ కళాశాల(జీపీటీ) ఆవరణలో మెడికల్ హబ్ ఏర్పాటు కోసం కేటాయించిన 7.5ఎకరాల స్థలం ఉండడంతో దానిలో రెండెక రాల స్థలం ఆయుష్‌ఆస్పత్రి నిర్మాణానికి ఇవ్వా లని ఎంపీ ప్రతిపాదనలు పంపారు. దీంతో 2022, నవంబరు 14న ఆయుష్ ఆస్పత్రి నిర్మాణానికి జీపీటీ ఆవరణలోని రెండెకరాలను కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. 2023, ఏప్రిల్, మే నెల మధ్య కాలంలో ఏపీఎంఎస్‌ఐడీసీ వారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ.7.5కోట్లు కూ డా కేటాయించారు. ఇలా రూ.12కోట్లతో భవన నిర్మాణం, రూ.3కోట్లతో పరికరాల కొనుగోలు, ఇతర సౌకర్యాలు, వసతుల కల్పనకు కేటాయించారు. దీంతో 2024,డిసెంబర్‌నాటికి 50పడకల ఆయుష్ ఆస్పత్రి భవనం పూర్తయ్యింది.
ఇలా చేస్తే ‘దారి’ లభించేనా?
జీపీటీ కళాశాల ప్రధాన గేటు నుంచి కుడివైపు(వేంకటేశ్వరస్వామి గుడివైపు)గా ఆయుష్ ఆ స్పత్రి భవన నిర్మాణం వర కు అర కిలోమీటరు మేర రహదారి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అది రోగులు వచ్చేందుకు దురాభారంకానుంది. జీపీటీ ప్ర హరీని చేర్చి.. చీడిలపొర డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలంనుంచి హైవే వైపునకు వెళ్లేలా రహదారి నిర్మిస్తే సులువుగా ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ప్రైవేటు వ్యక్తులనుంచి స్థల సేకరణ చేయాల్సి ఉంది. ఆయుష్ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈవిషయంలో ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీ స్పందిం చి ఆయుష్ ఆస్పత్రి ప్రారంభమయ్యే ‘మార్గం’ చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ప్రారంభించే ‘దారి’ లేక..
తొలుత ఆయుష్ ఆస్పత్రి నిర్మాణానికి స్థల సేకరణ విషయంలో కాస్త అడ్డంకి ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమిస్తూ ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయ్యింది. ఆయుష్ భవన నిర్మాణానికి తమ సొంత స్థలంలో రెం డెకరాలు కేటాయించిన ప్రభుత్వ మహిళా పా లిటెక్నికల్ కళాశాల అధికారులు.. ఆ ఆస్పత్రికి వెళ్లే దారి విషయంలో మెలిక పెట్టారు. తొలు త ఈ ఆస్పత్రి రాకపోకలకు సంబంధించి జీపీటీలో ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలంనుంచి నేరుగా కరణంగారి జంక్షన్ సమీపంలో ఉన్న కమల్‌వీర్ థియేటర్‌కు వెళ్లే మా ర్గాన్ని ప్రతిపాదిస్తూ జిల్లా అధికారులు నిర్ణ యించారు. అదే ఆస్పత్రికి వెళ్లే ప్రధాన ద్వారమని తేల్చారు. ఆయుష్ ఆస్పత్రి నిర్మించిన చోటే.. తమ కళాశాల విద్యార్థినుల వసతి గృహం ఉన్నందున, ఆస్పత్రికి వైద్యంకోసం వ చ్చే రోగులతో వారికి ఇబ్బంది కలిగే ప్రమా దం ఉందని, విద్యార్థినులకు అసౌకర్యంగా ఉంటుందని జీపీటీ ప్రిన్సిపాల్ అభ్యంతరం తెలిపారు. అంతకుముందు భవన నిర్మాణ ప నులు పూర్తయ్యే వరకు ఆ దారిని వినియోగించుకుంటామని ఆయుష్ అధికారులు అభ్య ర్థించడంతో ఆయన ఆ అవకాశం కల్పించారు. దీంతో ఆ మార్గం నుంచే ఆస్పత్రి భవన నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ తరలించి నిర్మాణాన్ని పూర్తిచేశారు. తీరా నిర్మాణం పూర్తయ్యాక.. ఇటు వైపు వెళ్లేందుకు దా రి లేదని జీపీటీ ప్రిన్సిపాల్ అభ్యంతరం తెలు పుతూ ఆయుష్ కమిషనర్‌కు నోటీసు పంపా రు. దీనిపై స్థానిక ఆయుష్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు కూడా తెలియజేశారు.