Share News

నాణ్యతలో రాజీ పడొద్దు

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:50 AM

నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రూ.2.66 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టే కడియం-జేగురుపాడు రోడ్డు నిర్మాణానికి ఆయన సోమవా రం శంకుస్థాపన చేశారు.

నాణ్యతలో రాజీ పడొద్దు
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గోరంట్ల

  • కడియం-జేగురుపాడు రహదారి శంకుస్థాపనలో ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, సెప్టెంబరు 15(ఆంద్రజ్యోతి): నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రూ.2.66 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టే కడియం-జేగురుపాడు రోడ్డు నిర్మాణానికి ఆయన సోమవా రం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గోరం ట్ల మాట్లాడుతూ మండలంలో కడియం, దామిరెడ్డిపల్లి, కడియపులంక గ్రామాల్లో కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించామని, పొట్టిలంక-దుళ్ల రోడ్డు నిర్మాణంతో పాటు కడియపుసావరం-మాధవరాయుడుపాలెం వరకు సీసీ రోడ్డుగా మార్పు చేయిం చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఆక్రమణల వల్ల డ్రైనేజీ సమస్యతో పాటు నీరు పోయే మా ర్గం లేక రహదారులు పాడవుతున్నాయన్నారు. కేంద్రం నుంచి రావా ల్సి నిధుల మంజూ రును బట్టి అభి వృద్ధి పనులు చేస్తామని గోరంట్ల అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌, ఏపీఐఐసీ డైరెక్టర్‌ మార్గాని సత్యనారాయణ, సర్పంచ్‌లు అన్నందేవుల చంటి, చెక్కపల్లి మురళి, టీడీపీ, జనసేన మండలాధ్యక్షులు వెలుగుబంటి నాని, ముద్రగడ జమీ, వైస్‌ ఎం పీపీ పంతం గణపతి, ప్రత్తిపాటి రామారావుచౌదరి, కడియపులంక, మురమండ సొసైటీ చైర్మ న్లు గట్టి నర్సయ్య, వట్టికూటి దత్తుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:50 AM