Share News

నన్నయా.. మన్నించవయ్యా!

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:55 PM

ఆదికవి నన్నయ మనవాడే అని చెప్పుకో వడం గోదారోళ్లకు మాత్రమే దక్కిన ఘనత. ఆయన పేరుతో ఇక్కడే విశ్వవిద్యాలయం కూడా ఉంది. రాజమహేంద్రవరాన్ని పాలిం చిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవిగా విన తికెక్కిన నన్నయ.. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.

నన్నయా.. మన్నించవయ్యా!

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ మనవాడే అని చెప్పుకో వడం గోదారోళ్లకు మాత్రమే దక్కిన ఘనత. ఆయన పేరుతో ఇక్కడే విశ్వవిద్యాలయం కూడా ఉంది. రాజమహేంద్రవరాన్ని పాలిం చిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవిగా విన తికెక్కిన నన్నయ.. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. కవిత్రయంలో ఒకడు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ కీర్తి అజ రామరం. వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో 2008లో ఆయనకు మందిరాన్ని నిర్మించి గౌరవించిన నగరపాలక సంస్థ.. ఆనక నిర్వహణ మరిచిపోయింది. ఆనం కళా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ప్రజా ప్రతి నిధులు, రాజకీయ నేతలు, పుర ప్రముఖులు, పెద్ద అధికారులు తరుచుగా వస్తుంటారు. కానీ ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న నన్నయ మందిర దుస్థితి మాత్రం వారి కళ్లలో పడక పోవడంతో అధ్వానంగా, అపరిశుభ్రంగా మం దిరం మారిపోయింది. ఎవరైనా ఆరాధింకుం దామన్నా నిత్యం తాళం వేసే ఉంటోంది. ఈ దుస్థితిలో నన్నయ మందిరాన్ని చూస్తున్న జనం ‘నన్నయా మన్నించయా!’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:55 PM