Share News

నిడదవోలు సమగ్రాభివృద్ధే ధ్యేయం : మంత్రి దుర్గేష్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 02:04 AM

నిడద వోలు సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

నిడదవోలు సమగ్రాభివృద్ధే ధ్యేయం : మంత్రి దుర్గేష్‌

నిడదవోలు, సెప్టెంబరు 9, (ఆంధ్రజ్యోతి): నిడద వోలు సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నిడదవోలు శాసనసభ్యునిగా ఏడాదికాలంలో సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరో రూ.150 కోట్ల పనులు జరుగుతు న్నాయన్నారు. నిడదవోలు పట్టణంలో రూ.105.85 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మునిసిపాలిటీ సాధారణ నిధుల నుంచి రూ.15.75 కోట్ల నిధులతో 240 అభివృద్ధి పనులు ప్రారంభించ గా ఇప్పటికే రూ.8.12 కోట్ల నిధులతో 187 పనులు పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.4.50 కోట్లు విడుదల కాగా, వీటి ద్వారా వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైన్స్‌ శుభ్రత పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణంలో ఉన్న 30 పడ కల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిది ద్దుతామని, ఇప్పటికే ఆధునికీకరణ పనులు జరుగు తున్నాయన్నారు. ప్రభుత్వంతో చర్చించి 2024లో ఎర్రకాలువ ముంపునకు గురైన 3071.41 హెక్టార్లలో పంట నష్టపోయిన 4631 మందికి 5.22 కోట్లు ఇన్‌ పుట్‌ సబ్సిడీ విడుదల చేయించామన్నారు. పర్యాటక శాఖామంత్రిగా అఖండ గోదావరి ప్రాజెక్టులో నిడ దవోలును అంతర్భాగం చేసి రూ.4 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 02:04 AM