ఇంటింటికీ తాగునీరు
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:22 AM
పి.గన్నవరం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రతిఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జలజీవన్‌మీషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్యఉద్దేశ్యం శివా రు ప్రాంతాల్లోను ఇంటింటికీ తాగునీరు అంది ంచడం. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జలజీవన్ మిషన్ నిధులు రూ.1650కోట్లతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. 30ఏళ్లపాటు తాగునీరు అంది ంచేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ పథకం ద్వారా 2011 జనాభా లెక్కల ప్రకారం 24.92 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టును ఏర్పాటు చే
జలజీవన్ మిషన్ నిధులు రూ.1650 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు
1647 హేబిటేషన్లలో 2,800 కిలోమీటర్ల మేర పైపులైన్ల ఏర్పాటు
గోదావరి జలాలను నేరుగా ప్రాజెక్టుకు తరలింపు
ఉమ్మడి జిల్లాలను ఈస్ట్రన్,
సెంట్రల్ డెల్టాలుగా విభజన
పైపులైన్ ఏర్పాటుకు
డీఐ పైపుల సిద్ధం
పి.గన్నవరం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రతిఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జలజీవన్‌మీషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్యఉద్దేశ్యం శివా రు ప్రాంతాల్లోను ఇంటింటికీ తాగునీరు అంది ంచడం. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జలజీవన్ మిషన్ నిధులు రూ.1650కోట్లతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. 30ఏళ్లపాటు తాగునీరు అంది ంచేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ పథకం ద్వారా 2011 జనాభా లెక్కల ప్రకారం 24.92 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తు న్నారు. రాబోయే కాలంలో మరో పదిలక్షల జనాభా పెరిగినా ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరం దించే లక్ష్యంగా చెప్తున్నారు. జలజీవన్‌మిషన్ నిధుల్లో కేంద్రం సగం నిధులిస్తే.. మరో సగం నిధులు రాష్ట్రం మంజూరు చేయాల్సి ఉంది. శివారు ప్రాంతాలకు సైతం వేసవిలోను తాగునీరును పుష్కలంగా అందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. కాల్వనీరుతో సంబంధం లేకుండా నేరుగా గోదావరి జలాలతో తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తెరమీదకు తీసుకువచ్చారు. కాల్వనీరు రోజురోజుకు అస్తవ్యస్తంగా తయారై కలుషితం అవుతున్న తరుణంలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు రావడం శుభపరిణామమే. ఈ పథకం టీడీపీ హ యాంలో తెరమీదకు వచ్చినప్పటికీ అప్పట్లో వైసీ పీ ప్రభుత్వం వచ్చి ముందుకు తీసుకురావడంలో విఫలమైంది. పనులు ప్రారంభించకుండానే టెం డర్లు సైతం రద్దయినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వాటర్‌గ్రిడ్ పథ కంపై ప్రత్యేక దృష్టి కనబరిచింది. దీంతో ఇటీవలే ఈ టెండర్‌ను మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే మండలాలవారీగా ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులు సర్వే పూర్తి చేయగా సంబంధిత కంపెనీ మళ్లీ సర్వే, డిజైన్‌లు సిద్ధం చేసింది.
బొబ్బర్లంక నుంచి సఖినేటిపల్లి వరకు..
బొబ్బర్లంకలో ప్రారంభమైన పైపులైన్ అమలాపురం కెనాల్ చెంతనే పలివెల వరకు వస్తుంది. అక్కడ నుంచి అవిడి నుంచి విడిపోయిన పైపులైను వయా నరేంద్రపురం మీదుగా పి. గన్నవరం వస్తుంది. అవిడి నుంచి మరో పైపు లైన్ వయా ముక్కామల, గంగలకుర్రు మీదుగా బండారులంక చేరుకుంటుంది. అలాగే పి.గన్న వరం నుంచి ప్రారంభమైన పైపు లైను జగ్గన్న పేట వచ్చి ఒకటి మామిడికుదురు వరకు వెళ్తుం ది. జగన్నపేట నుంచి ప్రారంభమైన మరో పైపు లైను సఖినేటీపల్లి మండలం వరకు చేరు కుంటుంది. అలాగే ఈస్ట్రన్‌డెల్టాలో కూడా రూపొందిన డిజైన్ మేరకు పైపు లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు పైపు లైను ఏర్పాటు నిమిత్తం గ్రామాల్లోకి 5.5 మీటర్లు పొడవు గల డిఐ (డక్టైల్ ఐరన్ పైప్) పైపులు చేరుకుంటున్నాయి. పి.గన్నవరం మండల పరిధిలో పోతవరానికి డీఐ పైపులతో కూడిన ట్రాలీలు అధిక మొత్తంలో చేరుకున్నా యి. పైప్‌లైన్ ఏర్పాటు నిమత్తం ఆర్‌అండ్‌బీ అధికారుల అనుమతులు తీసుకోవల్సి ఉందని పూర్తిస్థాయిలో అనుమతులు సిద్ధం చే సుకుని పనులు ప్రారంభిస్తారని అధికారులు చెప్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 35 మండలాలకు తాగునీరు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశలో 35 మండలాలకు సంబంధించి 1647 హేబిటేషన్లలో 2,800 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో తాగునీరు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బొబ్బర్లంకలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రా వాటర్ ఇన్‌టేక్ వెల్ ఏర్పాటు చేసి పైపులు ద్వారా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్‌లకు పంపిస్తారు. అక్కడి నుంచి మండలాలకు తద్వారా గ్రామాలకు తాగునీరును పంపిస్తారు. కాగా ప్రాజెక్టును ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లాల్లో ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలుగా విభజించి మండలాలు వారీగా తాగునీరు అందించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబందించి తూర్పుగోదావరి జిల్లాలో కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాలు... కాకినాడ జిల్లాకు సంబంధిం సామర్లకోట, కరప, బిక్కవోలు, పెదపూడి, తాళ్లరేవు, అనపర్తి, కాకినాడ రూరల్ మండలాలు.. కోనసీమ జిల్లాకు సంబంధించి 22 మండలాలలకు మొదటి విడతగా తాగునీరు అందించనున్నారు. ఈస్ట్రన్ డెల్టాకు సంబంధించి కడియం మండలంలో వద్ద ఫిల్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సెంట్రల్‌డెల్టాకు సంబంధించి ఆత్రేయపురం మండలం ఉచ్చిలిలో ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి 80 కిలోమీటర్లకు 30 నుంచి 40 సెంట్ల స్థలంలో ఒక సంపు, ఒహెచ్‌బిఆర్, వాచ్‌మేన్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఆ సంపుల నుంచి గొట్టాల ద్వారా వెళ్లిన తాగునీరు గ్రామాల్లో పంపిణీ జరుగుతుంది. గ్రామాల్లో 20 నుంచి 25వేలు జనాభాకు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి తద్వారా తాగునీరు అందించనున్నారు. అదే విధంగా ఇప్పటికే మండలాల్లో కొనసాగుతున్న తాగునీరు ప్రాజెక్టులను యఽథావిఽథిగా ఉంచి ఎప్పుడైనా వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి పైపులైన్లకు సంకేతిక సమస్య తలేత్తితే ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆయా గ్రామాల్లో తాగునీరు కొరత రాకుండా వినియోగించవచ్చని అధికారులు చెప్తున్నారు. కాగా ఫిల్టర్ యూనిట్‌లు, సంపులకు ప్రస్తుతం భూసే కరణ జరుగు తుందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. రెండోదశలో మిగిలిన మండలాలతో పాటు పశ్చి మగోదావరి జిల్లా లంకగ్రామాలకు సైతం తాగు నీరుందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.