కొత్త వంగడాల సాగుతో అధిక దిగుబడులు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:39 AM
రైతులు కొత్త వంగడాలు సాగు ద్వారా ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించుకోవాలని జిల్లా ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్లు చల్లా వెంకటనరసింహరావు, మానుకొండ శ్రీనివాస్ సూచించారు. కొంకుదురులో సార్వా కాలంలో పరిశోధనల నిమిత్తం రైతు కమతాల్లో వేసిన ఎంటీయూ-1443, రాగోలు రకాలైన ఆర్‌జీఎల్-7030, 7034, 7045, 703 9, 7038 నూతన రకాలను మంగళవారం పరిశీలించి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఏరువాక శాస్త్రవేత్తలు
బిక్కవోలు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రైతులు కొత్త వంగడాలు సాగు ద్వారా ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించుకోవాలని జిల్లా ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్లు చల్లా వెంకటనరసింహరావు, మానుకొండ శ్రీనివాస్ సూచించారు. కొంకుదురులో సార్వా కాలంలో పరిశోధనల నిమిత్తం రైతు కమతాల్లో వేసిన ఎంటీయూ-1443, రాగోలు రకాలైన ఆర్‌జీఎల్-7030, 7034, 7045, 703 9, 7038 నూతన రకాలను మంగళవారం పరిశీలించి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ రకాలు పం ట చేనుపై పడకుండా, సుడిదోమ ఆశించకుండా, కంకి నిండా గింజల తో ఆశాజనక దిగుబడులు ఇస్తున్నాయన్నారు.అలాగే దాళ్వాకు అనుకూలమైన ఎం టీయూ-1121, 1293, ఎన్‌ఎల్‌ఆర్-344 49 వంటి రకాలు వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు చింతా శ్రీని వాసరెడ్డి, ఏవో ఎన్.శామ్యూల్‌జాన్, ఏఈవో భా స్కరరెడ్డి, రైతులు కొవ్వూరి రామస్వామిరెడ్డి, కురుపూడి సత్యనారాయణ పాల్గొన్నారు.