Share News

రేపు కొత్త టీచర్లకు నియామకపత్రాల జారీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:48 AM

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ - 2025లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి టీచర్లుగా విజయం సాధించిన అభ్యర్థులను విజయవాడ తీసుకెళ్లడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి 70 ఆర్టీసీ బస్సు

రేపు కొత్త టీచర్లకు  నియామకపత్రాల జారీ

విజయవాడలో అందజేయనున్న సీఎం చంద్రబాబు

ఉమ్మడి జిల్లా నుంచి 70 ఆర్టీసీ బస్సులు సిద్ధం

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ - 2025లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి టీచర్లుగా విజయం సాధించిన అభ్యర్థులను విజయవాడ తీసుకెళ్లడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి 70 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 19న విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనే ఒక కార్యక్రమంలో కొత్త టీచర్లకు సీఎం నియామకపత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి వారంతా వెళ్లడానికి వీలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నా రు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 50 బస్సులు, కాకినాడ, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి పదేసి బస్సుల చొప్పున కేటాయించారు. 19న ఉదయం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్‌ నుంచి ఈ బస్సులన్నీ విజయవాడ బయలుదేరి వెళ్లనున్నాయి. ఇప్పటికే స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఏరోజుకారోజు బస్సులను సంసిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్న ఆర్టీసీ అధికార యంత్రాంగానికి తాజాగా విజయవాడకు బస్సులను కేటాయించాల్సి రావడం కత్తిమీదసాములా మారిందని చెప్తున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:48 AM