Share News

గురువులు..కొత్త కొలువులు!

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:54 AM

అంతా అనుకున్నట్టే జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసింది.

గురువులు..కొత్త కొలువులు!

మెగా డీఎస్సీ-2025 ద్వారా ఎంపిక

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖాళీల భర్తీ

మాట నిలుపుకున్న కూటమి సర్కారు

నూతన ఉపాధ్యాయుల ఆనందం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అంతా అనుకున్నట్టే జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసింది. కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయడంతో పాటు పోస్టింగ్‌ ఉత్తర్వులూ అందించింది.దీంతో నూతనోపాధ్యాయులు సోమవారం నుంచి బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. పాఠాలు చెప్పే పనిలో బిజీబిజీగా అవనున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వం జనవరిలో మరో డీ ఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది.మరో మూడు వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది.

1693 పోస్టులు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధి మెగా డీఎస్సీ-2025లో 1,241 పోస్టులకు 63,004 దరఖాస్తులు వచ్చాయి. 38,617 మంది పరీక్షలకు హాజరయ్యారు.ఎస్‌జీటీ 423, స్కూల్‌ అసిస్టెంట్‌ 818 ఉన్నాయి. ట్రైబల్‌ వెల్ఫేర్‌ విఽభాగంలో ఎస్‌ఏ (పీఎస్‌) 3, ఎస్‌ఏ (బీఎస్‌) 4, ఎస్‌ఏ(పీఈ) 1,ఎస్‌జీటీ 104 ఖాళీగా ఉన్నాయి. జోన్‌-2 పరిధిలో ఏపీ రెసిడెన్షియల్‌, ఏపీ మోడల్‌ స్కూళ్లు, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌/బీసీ వెల్ఫేర్‌/ట్రైబల్‌ (గురుకులం) యాజమాన్య పాఠశాలల్లో 348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీటీ 24 పోస్టులు భర్తీ చేసేలా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ఈ పోస్టులన్నింటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చింది.జూన్‌, జూలై నెలలో మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహించా రు.ఆగస్టులో కీ, ఫైనల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 28 నుంచి ఏడు దశల్లో జరిగింది. ఉద్యోగ నియామకపత్రాలు సెప్టెంబరు 25న అమరావతిలో అందజేశారు. అక్టోబరు మూడు నుంచి పదో తేదీ వరకు పలు కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. వృత్తిలో పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు వివరించారు.విద్యాశాఖ విధివిధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

టీచర్ల కొరత తీరింది..

కూటమి ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కొరత తీర్చింది.మెగా డీఎస్సీ- 2025 ద్వారా ఖాళీలను భర్తీ చేసింది. ఎంపికైన కొత్త గురువులు ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నారు.అనంతరం ఉపా ధ్యాయుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాళీలను ప్రకటించారు. వారికి కావాల్సిన స్థానాన్ని ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. శనివారం నూతనోపాధ్యాయులు ఎంచుకున్న స్థానాలను కేటాయిస్తూ పోస్టిం గ్‌ ఉత్తర్వులు ఈ నెల 11వ తేదీన అభ్యర్థుల మొబైల్‌లోని లీప్‌ యాప్‌కు పంపారు. పోస్టిం గ్‌ ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు అందరూ విద్యాశాఖాధికారులు సూచించిన అన్ని రకాల విద్యార్హతలు,కులం, ఆధార్‌, పాన్‌కార్డు తదితర వాటిని తీసుకుని వారికి పోస్టింగ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్న పాఠశాలలకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారులు సూచించారు. కొత్త కొలువులో చేరేందుకు నూతనోపాధ్యాయులు సమాయత్తమవుతున్నారు.కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ ద్వారా భారీగా ఉపా ధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారమే వేలాదిగా పోస్టులను భర్తీ చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో తమను భాగస్వాములుగా చేసిందని ‘కొత్త టీచర్లు’ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:54 AM