Share News

దారికి తెస్తున్నారు!

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:18 AM

ఉమ్మడి జిల్లాలో రహదారులు గోతులమయంగా మారాయి. అడుగుతీసి అడుగు వేయాలంటేనే నరక ప్రాయంగా మారాయి.

దారికి తెస్తున్నారు!

ఉమ్మడి జిల్లాలో అధ్వానంగా మారిన రహదారులకు మంచిరోజులు వస్తున్నాయి. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో రహదారుల దారుణ దుస్థితిపై వచ్చిన కథనాల నేపథ్యంలో డిసెంబరు నాటికి రోడ్లపై గుంతలు లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వచ్చే నెలలోగా మొత్తం రూ.110కోట్లకుపైగా నిధులు వెచ్చించి రహదారులను దారికి తేవడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఉమ్మడి జిల్లాకు రూ.49.50 కోట్లు మంజూరవగా, వీటితో పలు కీలక రహదారులను రిపేర్లు చేయడానికి నిర్ణయించారు. త్వరలో వీటికి టెండర్లు పూర్తిచేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయబోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

నరకప్రాయంగా మారిన రోడ్ల రిపేర్లకు రూ.49.50 కోట్లు మంజూరు

కాకినాడ జిల్లాలో 7 రోడ్లకు 16.21కోట్లు, కోనసీమలో రూ.30 కోట్లు

రాజమహేంద్రవరంలో కేశవరం -బొమ్మూరు రోడ్డుకు రూ.2.78 కోట్లు

వీటికి టెండర్లు పూర్తయ్యాక మరో రూ.60 కోట్లతో మిగిలినవీ దారికి..

‘ఆంధ్రజ్యోతి’ కథనాల నేపథ్యంలో రోడ్ల మరమ్మతులకు సీఎం ఆదేశం

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో రహదారులు గోతులమయంగా మారాయి. అడుగుతీసి అడుగు వేయాలంటేనే నరక ప్రాయంగా మారాయి. ఏటా వర్షాలు, వరదలతో పట్ట ణాల నుంచి గ్రామాల వరకు రోడ్లన్నీ ఛిద్రమవుతు న్నాయి. అయితే వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సి ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు వీటిని పూర్తిగా గాలికి వదిలేసింది. జనం గోతు ల రహదారుల్లో ప్రయాణించి మృత్యువాత పడడం, తరచు గాయాలపాలవుతున్నా వైసీపీ ప్రభుత్వం ఏనా డూ కనీసం పట్టించుకోలేదు. ఆ తర్వాత గడచిన ఏడా దిన్నరలో కోనసీమలో భారీ వర్షాలు, మూడుసార్లు గోదావరి వరద, తుఫాన్లతో రోడ్లన్నీ మరింత దారు ణంగా మారాయి. అటు తూర్పుగోదావరి జిల్లాలో భారీవర్షాలు, తుఫాన్ల ప్రభావంతో వందల కిలోమీటర్ల మేర రోడ్లు రూపురేఖలు కోల్పోయాయి. అలాగే కాకి నాడ జిల్లాలోను భారీవర్షాలు, తుఫాన్లు, ఏలేరు వరద తో రోడ్లన్నీ వందల కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. అయితే వీటిని చాలావరకు ప్రభుత్వం మరమ్మతులు చేసింది. ప్రధానంగా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి నాటికి రహదారుల కింద యుద్ధప్రాతిపదికన గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిన రోడ్డన్నింటినీ మర మ్మతులు చేసింది. ఒక్క కాకినాడ జిల్లాలో 119 రహ దారులను రూ.31.76 కోట్లు వెచ్చించి గుంతలు పూ డ్చింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రూ.62కోట్లతో రిపేర్లు చేసింది. అయితే ఇవి చేయగా ఇంకా వందల కిలోమీటర్ల కొద్దీ రహదారులు ముర మ్మతులకు నోచుకోలేదు. పైగా ఈలోపు ఈ ఏడాదిలో కురిసిన వర్షాలు, తుఫాన్ల ముప్పుతో ఆ రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కాకినాడ-సామర్లకోట రహ దారిని రూ.1.50 కోట్లతోను, కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డును రూ.80 లక్షలతోను, కోనసీమ, తూర్పుగోదావ రి జిల్లాల్లోను అనేక రహదారులను మరమ్మతులు చే యగా, మళ్లీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధ్వాన దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల కథనాలు ప్రచురిం చింది. అటు రాష్ట్రవ్యాప్తంగాను అన్ని జిల్లాల్లో రోడ్ల దుస్థితిపై వెలువడిన కథనాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తక్షణం అన్నింటికి మరమ్మతు చేయా లని, డిసెంబరుకి ఎక్కడా రోడ్లపై గుంతలు కనిపించ కూడదని అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో వచ్చేనెల మొదట్లో రూ.49.50 కోట్లతో పలు రహదారుల మరమ్మతుకు ఆర్‌అండ్‌బీ సన్నద్ధమైంది.

ఆ జిల్లాలో రూ.30 కోట్లతో...

కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఈ ఏడాది జనవరినాటికి పాట్‌ ఫ్రీ హోల్‌ కింద రూ. 45 కోట్ల వరకు వెచ్చించి ప్రభుత్వం రహ దారులను మరమ్మతు చేసింది. మిగిలిన రహదారులపైనా దృష్టిసారించింది. తాజా గా రూ.30 కోట్లతో 12 కీలక రహదారుల ను అద్దంలా మార్చబోతోంది. ముఖ్యంగా ముమ్మిడివరం-ముక్తేశ్వరం రహదారి మ రమ్మతులకు రూ.1.67కోట్లు కేటాయించిం ది. ముమ్మిడివరం- కాట్రేనికోన ఐనాపురం రోడ్డుకు రూ.2.92కోట్లు, రాజవరం- పొద లాడ రూ.3.11కోట్లు, ఉప్పలగుప్తం మండ లంలో సిరిపల్లి-మునిపల్లి రహదారి మర మ్మతుకు రూ.2.28 కోట్లు, ఐ.పోలవరంలో మురమళ్ల-ఎదుర్లంక రోడ్డుకి రూ.40.22 లక్షలు, ముమ్మిడివరం-ముక్తేశ్వరం రూ. 1.67 కోట్లు, కాకినాడ జిల్లాలో సర్పవరం జంక్షన్‌ నుంచి లైట్‌హౌస్‌ పేట రోడ్డుకు రూ.1.97కోట్లు, తుని ఎర్రకోనేరు నుంచి వేమవరం రోడ్డుకు రూ.3.01కోట్లు, కత్తి పూడి పామర్రు రోడ్డు గొల్లప్రోలు పరిధి లో రూ.3.16 కోట్లు, తుని కత్తిపూడి రోడ్డు రూ.2.54కోట్లు, గండేపల్లి మండలం తా ళ్లూరు-ఎల్లమిల్లి రూ.1.59 కోట్లు, జగ్గంపే ట నియోజకవర్గం పరిధిలో నరసాపురపు పేట-కాట్రావులపల్లి రహదారికి రూ.1.60 కోట్లు, కాజులూరు మండలం శలపాక- కాజులూరు రహదారి మరమ్మతుకు రూ. 2.34 కోట్లు వెరసి కాకినాడ జిల్లాలో మొ త్తం రూ.16.21 కోట్లు మరమ్మతులకు ని ధులు విడుదల చేసింది. అలాగే రాజమ హేంద్రవరంలో కేశవరం వయా బొమ్మూ రు రోడ్డు మరమ్మతుకు రూ.2.78 కోట్లు కేటాయించింది. వీటన్నింటికి ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలవగా, వచ్చే నెల మొదటి వారంలో పనులు ప్రారంభించి రహదారులను తీర్చిదిద్దడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అలాగే ఇవి పూర్తయ్యేలోగా మరో రూ.60 కోట్లతో ఉమ్మడి జిల్లాలో తుఫాన్లు, వరదలు, భా రీవర్షాలకు దెబ్బతిన్న మిగిలిన రహదా రులను కూడా మరమ్మతు చేయనున్నా రు. వీటిలో ఒక్క కాకినాడ జిల్లాలోనే మొంథా తుఫానుకు దెబ్బతిన్న రహదా రులకు రూ.30 కోట్లకుపైగా నష్టం వాటి ల్లగా వాటికి రిపేర్లు చేయనున్నారు. అలా గే ఇటీవల వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న కాకినాడ-సామర్లకోట రోడ్డుని ప్రభుత్వం రూ.2.50కోట్లతోను. కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డును అరకోటికిపైగా వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది.

Updated Date - Nov 25 , 2025 | 01:18 AM