పట్టాదారు‘పాస్’
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:47 AM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాల పం పిణీకి రంగం సిద్ధమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో పంపిణీకి శ్రీకారం
3.44 లక్షల పాస్ పుస్తకాలు రాక
గతంలో జగన్ బొమ్మతో జారీ
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు
మళ్లీ రాజముద్రతో పాస్‌బుక్‌లు
నేడో రేపో రైతులకు అందజేత
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాల పం పిణీకి రంగం సిద్ధమవుతోంది. భూసర్వే పూర్త యిన గ్రామాల్లో రైతులకు కొత్త పాస్ పుస్తకా లను అధికారులు అందించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ బొమ్మతో రైతులకు పాస్ పుస్తకాలు అరకొరగా ఇవ్వడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వీటి పంపిణీకి బ్రేక్ పడింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మునుపటిలా ఆంధ్రప్రదేశ్ రాజ ముద్రతో కొత్త పాస్‌పుస్తకాల జారీకి రెవెన్యూ శాఖ నిర్ణయిం చింది. ఎట్టకేలకు ఇవన్నీ జిల్లాలకు చేరుకున్నా యి. ఆగస్టు 15న వీటిని రీసర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు.
40 వేల మంది విజ్ఞప్తులు..
గత వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ అస్త వ్యస్తంగా మారింది. రైతుల భూములు కొనుగో లు చేసి ఏళ్లు దాటినా పాస్ బుక్‌లు అరకొరగా ఇచ్చారు. వాస్తవానికి ఇవి ఉంటేనే భూముల క్రయవిక్రయాలు సాగుతాయి. రైతులకు రుణా లు వస్తాయి.కానీ జగన్ సర్కారు అప్పట్లో ఇదేదీ పట్టించుకోలేదు. పాస్ పుస్తకాల కోసం తహశీ ల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరిగినా ఖాతరు చేయలేదు. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం కొత్తగా 2022 సమగ్ర భూ సర్వే చేపట్టి అరాచకం సృష్టించింది.దీనిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విసిగెత్తిపోయిన 40 వేల మందికిపైగా బాధితులు న్యాయం చేయా లంటూ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిం చారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించి గ్రామా ల వారీగా బాధితుల సమస్యలు వింటూ తిరిగి రీసర్వే చేపట్టింది. రీసర్వేలో సంబంధిత భూ యజమానులకు ముందే సమాచారం ఇచ్చి సర్వే చేపట్టారు.ఇలా ఉమ్మడి జిల్లాలో 600 గ్రామాల్లో సమస్యలు చాలా వరకు పరిష్కరించారు.
నేటికీ 1920 నాటి లెక్కలే..
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేటు భూముల సర్వే 1920లో జరిగింది. దీని ప్రకారమే 2022 వరకు భూ లావాదేవీలు జరిగాయి.వాస్తవానికి 1920లో జరిగిన భూసర్వే 30 ఏళ్ల పాటు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి.ఆ తర్వాత మళ్లీ భూ రీసర్వే జరగాలి. కానీ అనేక కారణాలతో సర్వే జరగలేదు. దీంతో ప్రభుత్వ,ప్రైవేటు భూమి ఏదైనా సరే వివాదం తలెత్తితే 1920 నాటి రీ సర్వే రిజిస్టర్ (ఆర్‌ఎస్ ఆర్) మాత్రమే రెవెన్యూ శాఖకు ప్రామాణికంగా మారింది. ఈ వందేళ్లలో అనేక మా ర్పులు వచ్చాయి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వందేళ్ల కిందట స్థితిగతుల ప్రకారమే కొనసాగుతున్నాయి.మరో పక్క ఎక్కడైనా వం దెకరాల భూమి ఉంటే దానికి ఏకమొత్తంగా ఒకే సర్వే నెంబర్ మాత్రమే కొనసాగుతోంది. ఈ సర్వే నెంబర్‌లో యాభై,అరవై మందికి భూమి ఉంటుంది. వీరు క్రయవిక్రయాలు జరిపితే ఒకే సర్వే నెంబరే అందరికీ ప్రామాణికంగా కొనసాగుతోంది. దీని వల్ల అనేక భూ వివాదాలు తలెత్తుతున్నాయి.
600 గ్రామాల్లో అస్తవ్యస్తం..
గత వైసీపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేయ డానికి కసరత్తు జరిపింది. ఒక్కో సర్వే నెంబర్‌లో ఎంత మందికి భూములున్నాయనేది గుర్తించి ఆ సర్వే నెంబర్‌లో ఉన్న వారందరికి కొత్తగా సబ్‌డివిజన్ చేసి ప్రతి ఒక్కరికి ఉమ్మ డిగా ఇంత కాలంగా ఉన్న సర్వే నెంబర్ స్థానంలో సబ్‌డివిజన్ సర్వే నెంబర్ కొత్తగా కేటాయించాలని నిర్ణయించింది. కానీ ఆచరణలో అప్పటి ప్రభుత్వం విఫలమైంది. సర్వేను వేగంగా పూర్తి చేయాలని ఒత్తిళ్లు తేవడంతో ఈ ప్రక్రియను రెవెన్యూ,సర్వేశాఖ అధికారులు అస్త వ్యస్తంగా మార్చేశారు.ఉమ్మడి జిల్లాలో ఆరు వందలకుపైగా గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. కాకినాడ జిల్లా 15 మండలాల పరిధిలో 269 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా 19 మండలా ల్లోని 190 గ్రామాలు, కోనసీమ జిల్లాలో 150కి పైగా గ్రామాల్లో సర్వే చేశారు. భూయజ మానులు లేకపోయినా పక్క స్థలాల యజమా నులను అడిగి రీ సర్వే కానిచ్చేశారు. దీంతో వేలాది మంది భూముల విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. మరి కొందరి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. రీసర్వే తప్పులతో భూయజ మానుల పేర్లు సైతం మారిపోయాయి. వీటిని సరిచేయాలని వేలాదిగా బాధితులు కాళ్లరిగేలా తిరిగినా ప్రభుత్వం పరిష్కరించలేదు. సర్వే పూర్తయిన గ్రామాల్లో సొంత ప్రచారం కోసం జగన్ బొమ్మతో పాస్‌బుక్‌ల జారీకి అధికారులు ప్రయత్నించారు. ఇది తీవ్ర విమర్శలపాలైంది.
మళ్లీ మంచి రోజులు..
జగన్ బొమ్మతో జారీ చేసిన పాస్‌బుక్‌లను నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త బుక్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని ఆగస్టు 15న రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పం పిణీ చేయబోతోంది. ఇప్పటికే ఇవన్నీ ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు చేరుకున్నాయి. కాకినాడ జిల్లాకు మొత్తం 1.47 లక్షలు, కోనసీమ 1.02 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకు 95 వేల వరకు వచ్చాయి. వీటిని ఆయా మండలాలకు తరలించి రైతులకు పంపిణీ చేయనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అనేక ఏళ్ల తర్వాత మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తళతళలాడే పాస్‌బుక్‌లు రైతులకు అందబోతున్నాయి. ఈ పాస్ బుక్‌లపై క్యూఆర్‌కోడ్‌తోపాటు ఆధార్ నెంబరు ఉంటుంది. దీని ఆధారంగా ప్రతి యజ మాని తమ సొంత భూమి వివరాలు తెలుసు కునే వెసులు బాటును ప్రభుత్వం కల్పించింది. మరో పక్క పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెనక్కు తీసుకుని మళ్లీ కొత్తవి జారీ చేయనున్నారు. కొత్త పాస్‌బుక్‌లతో భూ య జమానుల సమస్యలు తీరనున్నాయి.