తూర్పు సిందూరం!
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:40 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు మూడు కాదు.. నాలుగు కానున్నాయి.. రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా పోల వరం ఏర్పాటు కానుంది.
పోలవరం జిల్లా ఏర్పాటు
రంపచోడవరం కేంద్రం
రెండు డివిజన్లతో నిర్ణయం
నాలుగుకు పెరిగిన జిల్లాలు
‘తూర్పు’న కలిసిన మండపేట
పెద్దాపురానికి..సామర్లకోట
ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట
గిరిజనానికి తీరిన ఇబ్బంది
ఇక ఆమోదమే తరువాయి..
(రంపచోడవరం/చింతూరు/ రాజమహేంద్రవరం/అమలాపురం/ మండపేట/ కాకినాడ- ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు మూడు కాదు.. నాలుగు కానున్నాయి.. రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా పోల వరం ఏర్పాటు కానుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ పార్లమెంట్ నియోజకవర్గాలతో మూడు జిల్లాలుగా ప్రకటించింది. నాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన జరగలేదు. అప్పట్లో ప్రజలు ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తరువాత సీఎం చంద్రబాబు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్వ్యవస్థీక రణ చేపట్టాలని నిర్ణయించారు. ఏజెన్సీలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు.. కాకినాడ డివిజన్‌లో ఉన్న సామర్లకోటను పెద్దాపురం డివిజన్‌లో కలిపారు. మండపేట నియోజకవర్గాన్ని తూర్పులో విలీనం చేయనున్నారు.
గిరిజనానికో జిల్లా
రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. గత ప్రభుత్వ నిర్వాకంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి రంపచోడవరం నియోజకవర్గం వెళ్లిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రంపచోడవరం, చింతూరు డివిజన్‌ల పరిధిలోని రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజ ఒమ్మంగి, చింతూరు, వి.ఆర్.పురం, కూనవరం, ఎటపాక మండలాల ప్రజానీకం జిల్లా కేంద్రానికి 300 కి.మీ దూరంలో ఉన్న పాడేరు వెళ్లాల్సి వచ్చేది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకు సీఎం చంద్రబాబు రంపచోడవరం కేంద్రం పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయించడంతో ప్రజల వెతలు తీరనున్నాయి. 2022లో చంద్రబాబు చింతూరు డివిజన్‌లోని కూనవరం మండలం కోతులగుట్టలో పర్యటించారు. మేము అధికారంలోకి రాగానే పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చారు. ఈ మేరకు 11 మండలాలతో సుమారుగా 3.49 లక్షల జనాభాతో భౌగోళికంగా ఈ కొత్త జిల్లా ఆవిర్భవించనున్నది. వై రామవరం మండలంలోని గుర్తేడు కేంద్రంగా మండలం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. తుది నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం 11 మండలాలతో జిల్లా ఏర్పాటుచేసినా దేవీపట్నం, కూనవరం, వీ.ఆర్.పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో 150 గ్రామాలు పోలవరం ముంపులోనికి వెళ్లిపోతాయి. పూర్తిగా కూనవరం, వీ.ఆర్.పురం, దేవీపట్నం మండలాలు కనుమరుగైపోతాయి. చింతూరు, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలు ముంపులోనికి వెళ్లిపోతాయి. దీంతో కొత్త జిల్లాలో 8 నుంచి 9 మండలాలే మిగులుతాయి. ఈ పరిస్థితుల్లో పోలవరం నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో కలిపితే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. అక్కడా పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాలు ముంపులోకి వెళ్లిపోతాయి. గిరిజన జిల్లాలకు రెవెన్యూ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలకు రెవెన్యూ లేదు. అయినా రంపచోడవరం, చింతూరు డివిజన్ల ప్రజల సమస్యలను ఎలా తీర్చాలన్న అంశంపై ప్రభుత్వం యోచిస్తోంది. పోలవరం జిల్లా ఏర్పాటుతో రాష్ట్రంలో ఇది మూడో గిరిజన జిల్లా. భవిషత్తులో మూడు జడ్పీలు గిరిజనులకు కేటాయించబడతాయి. గిరిజన స్వపరిపాలన లక్ష్యం దిశగా కూటమి సర్కారు అడుగులు వేసినట్టవుతుంది.
మండపేట కేరాఫ్ తూర్పుగోదావరి
కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని పూర్తిగా తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయనున్నారు. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రాజమహేంద్రవరా నికి సమీపంలో ఉన్నాయి. మండపేట రాజమహేంద్రవరానికి 26.3 కి.మీ దూరంలో ఉండగా ప్రస్తుత జిల్లా కేంద్రం అమలా పురం 47.5 కి.మీ దూరంలో ఉంది.మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సైతం మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలని అసెంబ్లీలో కోరారు.ఇదే ప్రతిపాదన మంత్రి వర్గ ఉపసంఘం చేయడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజా మార్పులతో రామచంద్రపురం రెవె న్యూ డివిజన్‌లోని మండపేట నియోజకవర్గం తొలగిపో నుం డడంతో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అతి చిన్నదిగా మారిపోతోంది. ఈ డివిజన్‌ను అలాగే ఉంచుతారా లేదా సమీ పంలోని కొత్తపేట డివిజన్‌లో కలుపుతారా అనేది చూడాలి. దీంతో కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య ఆరుకు పడిపోగా.. తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 8కి చేరింది. ఇప్పటికే ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కాకినాడ జిల్లాలోను రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలం కాకినాడ జిల్లాలో ఉండడంతో కోనసీమ చిన్న జిల్లాగా మారింది.దీనిపై రాజకీయంగా ఉద్యమాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పెద్దాపురం డివిజన్‌కు సామర్లకోట
కాకినాడ డివిజన్‌లో ఉన్న సామర్ల కోట మండలాన్ని పెద్దాపురం డివి జన్‌లోకి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సామర్లకోట, పెద్దాపురం మండ లాలు కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోల పరిధిలో వేర్వేరుగా ఉన్నా యి. దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో సామ ర్లకోట మండలాన్ని కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి తప్పించి పెద్దాపురం డివిజన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. కాకినాడ జిల్లాలో ఉన్న కాజులూరు మండలాన్ని కోనసీమ జిల్లాలో విలీనం చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. కాజు లూరు పేరుకు కాకినాడ జిల్లాలో ఉన్నప్పటికీ ఈ మండలం కోన సీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలో కొనసాగు తోం ది. దీనిపై ప్రభుత్వం ఎటూ నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాజు లూరు కాకినాడ జిల్లాలో కొనసాగనుంది.
విభజన జరిగింది ఇలా..
కొత్త జిల్లాల్లో పర్యటించి ఎక్కడెకక్కడ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పర్యటించింది. విభజిత జిల్లాలో ఎలాంటి మార్పులు చేయాలనేది పరిశీలించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసింది. నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందించింది.
మా పోరాటం ఫలించింది
మా పోరాటం ఫలించింది. కూటమి ప్రభుత్వం మండపేట నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షను నిజం చేసింది. మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలుపుతూ తీసుకున్న నిర్ణయం శుభపరిణామం. ఇది సమష్టి విజయం. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తీరతాయి. - వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్యే
చారిత్రాత్మక నిర్ణయం
రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం చారిత్రాత్మకం. ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెరమీదకు వచ్చింది.
- మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే