Share News

కొత్త జిల్లా.. పోలవరం

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:13 AM

రంపచోడవరం కేంద్రంగా పోలవరం కొత్త జిల్లా ఏర్పాటు తుది అంకానికి చేరుకుంది. రేపు గెజిట్‌ నోటిఫికేషన్‌ రానుంది. దీంతో కొత్త ఏడాదికి ఒకరోజు ముందుగానే కొత్త జిల్లా ఏర్పాటుకానుంది.

కొత్త జిల్లా.. పోలవరం

రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు

సీఎం అధ్యక్షతన మంత్రి మండలి ఆమోదం

రేపటి నుంచే అమల్లోకి 8 జారీ కానున్న గెజిట్‌

రంపచోడవరం కేంద్రంగా పోలవరం కొత్త జిల్లా ఏర్పాటు తుది అంకానికి చేరుకుంది. రేపు గెజిట్‌ నోటిఫికేషన్‌ రానుంది. దీంతో కొత్త ఏడాదికి ఒకరోజు ముందుగానే కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలవనుంది. సామర్లకోట మండలం కాకినాడనుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో కలవనుంది. ఈ మార్పులు రేపటినుంచి అమలు కానున్నాయి. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాలుగు జిల్లాలు కానుండగా ఆయా జిల్లాల స్వరూపాలు మారనున్నాయి.

2 డివిజన్లు.. 12 మండలాలు

సీఎం చంద్రబాబు యోచనతో కొత్త జిల్లా ఏర్పాటు

రంపచోడవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రంపచోడవరం కేం ద్రం గా పోలవరం కొత్త జిల్లా ఏర్పా టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్య క్షతన రాష్ట్ర మంత్రిమండలి సోమ వారం ఆమోదం తెలిపింది. కొత్తగా పోలవరం జిల్లా రంపచోడవరం, ఎట పాక డివిజన్లతో 12 మండలాలతో 3,49,953 మంది జనాభాతో ఏర్పాటవుతోంది. కొత్తగా గుర్తేడు మండలం ఏర్పాటు కానుంది. రెండు రెవెన్యూ డివిజన్లతో 12 మండలాలను పోల వరం జిల్లాగా ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు చొరవ చూపారు. పోలవరం పునరావాసమే లక్ష్యంగా జిల్లా ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభు త్వం అనాలోచితంగా పాడేరు కేం ద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరి జిల్లాతో రంపచోడవరం, చింతూరు డివిజన్ల ప్రజానీకమే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి రాకముందే ఈ సమస్యలను గుర్తిం చింది. ఎన్నికలకు ముందే ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మండలి సిఫార్సు మేరకు జిల్లాల పునర్విభజన చట్టం కింద బుధ వారం ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి మార్గం సుగమమైంది.దానికి అనుబంధంగా జిల్లా కలెక్టరు,ఎస్పీ, అధికా రులు, వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలను చేపట్టనుంది.

పెద్దాపురంలోకి సామర్లకోట

సామర్లకోట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పెద్దాపురం నియోజకవర్గంలో ప్రధానమైన సామర్లకోట పట్టణం, మండలాన్ని ఇకనుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి చేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌ ఏకగ్రీవంగా తీర్మానించింది. సామర్లకోట మండలం కాకినాడ ఆర్డీవో పరిధిలో ఉంది. ఇక నుంచి రెవెన్యూ కార్య కలాపాలు, విద్యుత్‌ కార్యాల యాల కార్యకలాపాలు పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి అనుసంధానం చేశారు. ఈ నిర్ణయంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పునకు సంబంధించి జరిగిన చర్చల్లో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కూడా పాల్గొన్నారు.

రాజమండ్రిలోకి మండపేట

మండపేట, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మండపేట నియోజకవర్గాన్ని రాజమ హేంద్రవరంలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి సోమవారం ఆమోద ముద్ర వేసింది. మండపేట నియోజకవర్గ ప్రజలకు దూరాభారంగా మారిన కోనసీమ జిల్లా నుంచి చెంతనే ఉన్న ‘తూర్పు’లో కలపాల ంటూ నియోజకవర్గ ప్రజల డిమాండ్‌ చేశారు. వారి ఆకాంక్షను నిజం చేసిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌లకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల స్థానిక నేతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 01:14 AM