ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి నూతన కమిటీ
ABN , Publish Date - May 30 , 2025 | 12:58 AM
ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి అంబేడ్కర్ కోనసీమ జిల్లా నూతన కమిటీని ఏపీ రైతుసంఘం జిల్లా కోఆర్డినేటర్ కొప్పుల సత్తిబాబు ప్రకటించారు.
అమలాపురం టౌన్, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి అంబేడ్కర్ కోనసీమ జిల్లా నూతన కమిటీని ఏపీ రైతుసంఘం జిల్లా కోఆర్డినేటర్ కొప్పుల సత్తిబాబు ప్రకటించారు. అమలాపురంలో గ్యాస్, చమురు, ఖనిజ, ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి ప్రతినిధుల సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని వెల్లడించారు. జిల్లా కన్వీనర్‌గా ఉండవల్లి గోపాలరావు, కోకన్వీనర్‌గా గండి ఏసుదాసు, జిల్లాకమిటీ సభ్యులుగా జాలెం సుబ్బారావు, రాపాక రత్నరాజు, వంటెద్దు వెంకన్నాయుడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బండారు రామ్మోహనరావు, దేవ రాజేంద్రప్రసాద్, పులపర్తి సురేష్‌లను నియమించారు. కమిటీ పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించింది. సహజ వనరులు ప్రజల ఆస్తి అయినందున వారికి యాజమాన్య హక్కు కల్పించాలన్నారు. చమురు సహజవాయువు కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. నగరం గ్రామ సమగ్రాభివృద్ధి చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని సత్తిబాబు ప్రకటించారు.