మేం..డ్రాప్!
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:42 AM
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎక్సైజ్ శాఖ ప్రతి పాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న విధానాల్లో మార్పులను చేస్తూ కొత్త పాలసీని తెచ్చారు. దీంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్‌లు అందుబాటులోకి రానున్నా యి.
బార్ వ్యాపారులు బేర్
దరఖాస్తులకు వెనుకంజ
పర్మిట్ రూమ్‌లతో ఆందోళన
తూర్పున 25 బార్‌లు
లాటరీ విధానంలో కేటాయింపు
29 వరకు దరఖాస్తు గడువు
సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎక్సైజ్ శాఖ ప్రతి పాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న విధానాల్లో మార్పులను చేస్తూ కొత్త పాలసీని తెచ్చారు. దీంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్‌లు అందుబాటులోకి రానున్నా యి. మద్యం విక్రయ వేళలను పొడిగించారు. మూడేళ్ల పాటు ఈ పాలసీ అమలులో ఉం టుంది. బార్లను లాటరీ విధానంలో కేటా యిస్తారు. గతంలో వేలం విధానంలో కేటాయిం చారు. గీత కులాల వారికి తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఒక్కో బార్‌కి కనీసం 4 దర ఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఒక దర ఖాస్తు రుసుం రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్, అదనంగా మరో రూ.10 వేలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అయితే ప్రస్తుత బార్ వ్యాపారులు మాత్రం కొత్త బార్ పాలసీపై బేర్ మంటున్నా రు.ఒక్కో బార్‌కి కనీసం రూ.కోటి వరకూ ఖర్చు అవుతుందని..అంత సొమ్ము వెనక్కు వచ్చే దారి లేదని ప్రస్తుత మద్యం వ్యాపారులు చెబుతు న్నారు. ఎన్నో ఏళ్ల నుంచీ బార్ వ్యాపారంలో ఉన్న వాళ్లు సైతం తాము ఈసారికి డ్రాప్ అం టున్నారు. 2019కి ముందు టీడీపీ హయాంలో ఉన్న పాలసీని తీసుకొస్తే ఓకే అంటున్నారు. దీంతో జిల్లాలో బార్‌ల దరఖాస్తులపై ఆందోళన నడుస్తోంది. జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం బార్ పాలసీ ప్రక్రియలో తలమునకలై గీత గీసుకొని విధులు నిర్వహించేస్తున్నారు.
జిల్లాకు 25 బార్‌లు..
మద్యం షాపుల తరహాలోనే బార్‌లకు లైసె న్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. జగన్ హ యాంలో వేలం విధానంలో రెండేళ్ల పరిమితికి లైసెన్స్‌లు జారీ చేశారు. ఆగస్టు 31తో బార్‌ల రెండేళ్ల లైసెన్సు గడువు ముగుస్తోంది. మొత్తం బార్‌లకు లాటరీ నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. దీనికే కేబినెట్ ఆమోదం తెలి పింది. దీంతో తూర్పు గోదావరిలో జనరల్ కేట గిరీలో 22, గీత కార్మికులకు 3 కలిపి 25 బార్లు రానున్నాయి.రాజ మహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ 18, కొవ్వూరు మునిసిపాలిటీ 1, నిడదవోలు ముని సిపాలిటీ 2, కడియపులంక టూరిజం సెంటర్ 1, గీత కార్మికులకు రాజ మండ్రి కార్పొరేషన్, కొవ్వూరు, నిడదవోలులో ఒక్కోటి చొప్పున కేటా యించారు.జనాభా ఆధారంగా లైసెన్సు ఫీజు ఖరారు చేశారు. 50 వేల వరకూ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35 లక్షలు,ఆపై 5 లక్షల వరకూ రూ.55 లక్షలు, ఆపైన రూ.75 లక్షలుగా ఖరారు చేశారు. గీత కార్మికులకు కేటాయించే బార్‌లకు వాటిలో సగం మాత్రమే వసూలు చేస్తారు. కొత్తగా వచ్చే బార్లలో రూ.99 మద్యం దొరకదు. బార్ లకు దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో కూడా స్వీకరిస్తారు.ఈ నెల 29 చివరి తేదీగా నిర్ణయిం చారు. విమానాశ్రయాల్లో కూడా బార్ లను ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించారు. బార్ లకు ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అనుమతి ఉంది. అయితే కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకూ తెరిచి ఉంచొచ్చు.
వ్యాపారుల్లో నిరాశ!
బ్రాందీ షాపులు, బార్లు ఏవైనా సరే సిండి కేట్లుగానే రంగంలోకి దిగుతారు. అదీ మద్యం వ్యాపారంలో ఏళ్ల తరబడి ఉన్న వాళ్లే ఎక్కువగా ఉంటారు. కొత్తవాళ్లు రావడం, నిలదొక్కుకోవడం అరుదు. ఇప్పుడు కొత్త బార్ పాలసీపై ప్రస్తుత బార్ వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం విధానంతో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. అందువల్ల వైసీపీ హయాంలో ఆ విధా నాన్ని అమలుచేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లాటరీ విధానాన్ని అమలుచేస్తోంది. జనాభా ప్రాతిపాదికన ఫీజు ఫిక్స్ చేసి లాటరీ వేస్తున్నారు. అయితే ఒక్కో బార్‌కి కనీసం 4 దరఖాస్తులు వస్తేగానీ లాటరీ వేయరు. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు మొత్తం రూ.5.10 లక్షలు చెల్లించాలి. అంటే నలుగురు కూటమిగా ఏర్పడి ఒక బార్‌కి నాలుగు దరఖాస్తులు సమర్పిస్తే.. ఆ దరఖాస్తు వెల రూ.20.40 లక్షలు అవుతుంది.బార్ ఏడాది లైసెన్సు ఫీజు కలుపుకుంటే.. మొత్తం రూ.కోటి పైనే అవుతుంది. నిర్వహణ ఖర్చులు, వడ్డీలు వంటివి కలుపుకుంటే బార్‌లో రోజు కు అమ్మకాలు కనీసం రూ.75వేలకు పైగా ఉంటేనే గిట్టుబాటవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్‌ల మద్యం దొరుకుతోంది. దాంతో బార్‌లలో అదనపు ధరలతో అమ్మితే ఎంతమేర విక్రయాలు సాగుతాయన్నది మరో ప్రశ్న.పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇస్తున్నందున వాటి ప్రభావం కూడా బార్‌లపై పడే అవకాశం ఉంది.ఒక బార్‌కి 4 దరఖాస్తులు, ఇష్యూ ప్రైస్ పై 15 శాతం అదనంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్‌ఈటీ) వసూలు అంశాల పైనా వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇవన్నీ బేరీజు వేసుకుంటే వ్యాపారం చేయడం కష్టమేనన్నది వ్యాపారుల అభిప్రాయం. ప్రభు త్వం పాలసీలో అనుకూల మార్పులు తీసురావాలని డిమాండు వినిపిస్తోంది.
జోష్ ఉంటుందా?
2022లో బార్ లైసెన్సు ఫీజు ఏకంగా రూ.కోటికిపైగా ఉన్నా పర్మిట్ రూంలు లేక పోవడంతో బార్‌ల దందా నడిచింది. ప్రైవేటు మద్యం షాపులకు నిర్వహించిన ప్రక్రి య లో ఆఫ్‌లైన్‌లో 2970, ఆన్‌లైన్‌లో 1414.. మొత్తం 125 షాపులకు 4384 దరఖాస్తులు అం దాయి. గోపాలపురంలో ఓ షాపునకు ఏకంగా 68 దరఖాస్తులు వచ్చాయి.ఇప్పుడు బార్ దర ఖాస్తుల విషయానికొస్తే ఆ జోరు కనబడక పోవచ్చు. ప్రస్తుత వ్యాపారస్తులు ఈ పాలసీని తిరస్కరిస్తుండగా బ్లాక్ మనీని వైట్‌గా మార్చు కొనే అక్రమార్కులకు వరంగా కనిపిస్తోంది.బ్లాక్ మనీ పోగుబడిన వాళ్లు రం గంలోకి దిగి బార్ల దరఖాస్తులు సమర్పించి.. వ్యాపారాల్లోకి వస్తే పెద్ద మొత్తంలో అక్రమ సొమ్ము సక్రమ ఖాతా ల్లో చేరే అవకాశం ఉంది. దీనిపై కూడా ఇన్‌కంట్యాక్స్ దృష్టి సారించాల్సి ఉంది.