నీట్ పరీక్ష ప్రశాంతం
ABN , Publish Date - May 05 , 2025 | 12:32 AM
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యా కోర్సులో ప్రవేశానికి ఆదివారం యానాం జవహర్ నవోదయ విద్యాలయంలో నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
యానాం, మే 4(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యా కోర్సులో ప్రవేశానికి ఆదివారం యానాం జవహర్ నవోదయ విద్యాలయంలో నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. యానాంలో నవోదయ సెంటర్‌లో 134మంది విద్యార్థులకు ఒక విద్యార్థి వినహా మిగిలిన వారందరూ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మధ్యా హ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరిగింది. ఈపరీక్ష కేం ద్రాన్ని యానాం పరిపాలనాధికారి మునిస్వామి, విద్యాలయం ప్రతినిధులు ప్రకాశరావు, శరత్‌చంద్రకీర్తి, యానాం విద్యాశాఖాధికారులు పరిశీలించారు.