Share News

నిమ్మ రైతు..కంటి చెమ్మ!

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:28 AM

గిట్టుబాటు ధరలేక నిమ్మరైతుల కళ్లు చెమ్మ గిల్లుతున్నాయి. పెట్టుబడితో పాటు శ్రమకు తగిన ఫలితం లేకపోవడంతో నిమ్మకాయలు చెట్ల నుంచి కోయడానికి కూడా రైతు అడుగు ముందుకు వెయలేకపోతున్నాడు.

నిమ్మ రైతు..కంటి చెమ్మ!
నిమ్మకాయలు

కిలో రూ.20 నుంచి రూ.25

గిట్టుబాటు కాక ఆందోళన

లబోదిబోమంటున్న రైతులు

గోపాలపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధరలేక నిమ్మరైతుల కళ్లు చెమ్మ గిల్లుతున్నాయి. పెట్టుబడితో పాటు శ్రమకు తగిన ఫలితం లేకపోవడంతో నిమ్మకాయలు చెట్ల నుంచి కోయడానికి కూడా రైతు అడుగు ముందుకు వెయలేకపోతున్నాడు. ఆశించిన ధర దక్కకపోవడానికి ధరలు తగ్గుదలే ప్రధా న కారణమని నిమ్మరైతులు చెబుతున్నారు. ఏళ్ల కొద్దీ తోటలు పెంచి పూతసమయంలో వర్షాలు కురవడం, పూత రాలిపోవడం వంటి పరిణామాలు నిమ్మ రైతులపై ప్రభావం చూపుతున్నాయి. వేసవిలో ధరలు గరిష్టంగా పెరగడంతో దిగుబడి లేక రైతులు ఆశించిన స్థాయిలో నిమ్మకాయలు ఉత్పత్తి చేయలేక పోయారు. ప్రస్తుతం దిగుబడి అధికంగా ఉన్న ప్పటికి ధరలు పడిపోవడంతో నిమ్మరైతుకు అనాసక్తి కలుగుతుంది. ఈ ఏడాది వేసవిలో కిలో నిమ్మ ధర గరిష్టంగా రూ.70 - రూ.80ల వరకు పెరిగింది. రైతుకు ఆశించిన స్థాయిలో ధర ఉన్నప్పటికి ఉత్పత్తి, దిగుబడి లేకపోవ డంతో డీలా పడ్డారు. ప్రస్తుతం దిగుబడి ఉన్నా ధరలు పతనం కావడంతో కిలో నిమ్మ ధర రూ.25 -20 పలుకుతోంది. కిలోకు చిన్న సైజు అయితే 25 కాయలు వస్తాయి.. పెద్ద సైజు అయితే 18 కాయలు వరకూ వస్తాయి. దీంతో దిగుబడి ఉన్న ఫలితం దక్కడం లేదం టూ నిమ్మరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిమ్మపై పొగాకు ప్రభావం

ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో పొగాకు, నిమ్మ సాగుపై ప్రభావం చూపుతుంది. దీంతో ఆశిం చిన స్థాయిలో పెట్టుబడికి దగ్గ ఫలితం లేక పోవడంతో నిమ్మ రైతులు పొగాకు సాగుపై మక్కువ చూపుతున్నారు. గత మూడేళ్లగా పొగాకు ధరలు గరిష్టంగా పెరగడంతో నిమ్మ ను తొలగించి పొగాకు సాగుపై నిమ్మరైతులు సాగుకు మక్కువ చూపుతున్నారు. కాస్తో కూ స్తో మిగిలిన నిమ్మ రైతులకు కనీస ధరలు దక్కకపోవడంతో నిరాశచెందుతున్నారు. నిమ్మ ధరలు ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో నిమ్మ సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది.

కూలీల ఖర్చులు రావడంలేదు

రెండెకరాల నిమ్మతోటలో కాయలు కోసి మార్కెట్‌కు తీసుకెళితే కనీసం కూలీల ఖర్చుకు రావడం లేదు. దీంతో నిమ్మకాయలు కొయ్యకుండా తోటలోనే వదిలేశాం. ప్రభుత్వం నిమ్మసాగు రైతులకు మద్దతు ధర ప్రకటిస్తే రైతులు గట్టెక్కుతారు.

- వి.కృష్ణమూర్తి, రైతు, కరిచర్లగూడెం

సాగుపై మక్కువపోయింది

గత దశాబ్ద కాలంగా నిమ్మ సాగు చేస్తున్నా. అధిక లాభాలు చూసిన రోజులు ఉన్నాయి. ప్రస్తుత నిమ్మ మార్కెట్‌ అందుకు భిన్నంగా ఉంది. ఎంత శ్రమ పడినా ఫలితం లేక నిమ్మసాగుపై ఉన్న మక్కువ పోయింది. ఈ - మార్కెట్‌ ఏర్పాటు చేయాలి.

-కాశిం సాహెబ్‌, రైతు, కొవ్వూరుపాడు

Updated Date - Aug 11 , 2025 | 12:28 AM