Share News

లోక్‌ అదాలత్‌లో 403 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:11 AM

అన పర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 403 కేసులు పరిష్కరించినట్టు న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న తెలిపారు.

లోక్‌ అదాలత్‌లో 403 కేసుల పరిష్కారం
కేసులను పరిష్కరిస్తున్న న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న

  • న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న

అనపర్తి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): అన పర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 403 కేసులు పరిష్కరించినట్టు న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న తెలిపారు. వీ టిలో 18 క్రిమినల్‌, 8 ఎక్సైజ్‌, 8 ఎన్‌ ఐయాక్టు, 4 మనీ సూట్‌, 2 ఈపీ, 351 ఎస్టీసీ(పైన్‌), 12 సీసీ కేసులు పరిష్కారమైనట్టు ఆమె తెలిపారు. వీటి ద్వారా రూ.20.13 లక్షల నగదు సెటిల్మెంట్‌ జరిగినట్టు న్యాయమూర్తి ప్రసన్న తెలిపారు. కార్యక్రమంలో మం డల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ప్రతినిధులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 01:11 AM