జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:20 AM
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సీతంపేట గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ లు నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ పి తామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, గాం ధీ మహాత్ముడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం కల్చరల్, నవంబరు 18( ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సీతంపేట గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ లు నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ పి తామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, గాం ధీ మహాత్ముడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మెంబరు మగతాల పద్మజను సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆర్‌సీహెచ్ వెంకట్రావు, గౌతమి గ్రంథాలయాధికారి ఘంటా శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు. పద్మజ గౌతమీ గ్రంథాలయాన్ని సందర్శించి గ్రంథాలయంలోని విలువైన తాళపత్రాలను, తా మ్ర శాసనాలను, ప్రాచీన గ్రంధ సం పదను తిలకించారు. గ్రంథాలయం లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా రమాకుమారి, ద్రాక్షావళి, సూర్యకుమారి వ్యవహరించారు.