Share News

సమాజ హితమే.. నాటికల అభిమతం

ABN , Publish Date - May 25 , 2025 | 01:52 AM

సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు పుట్టిన నాటి కలను పోషించడం కూడా ఒక కళేనని అది నల్లమిల్లి మూలారెడ్డికే దక్కిందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నా రు.

సమాజ హితమే..  నాటికల అభిమతం
ఎంపీ పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్‌ బీవీఆర్‌ చౌదరి

అనపర్తి, మే 24 (ఆంధ్రజ్యోతి) : సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు పుట్టిన నాటి కలను పోషించడం కూడా ఒక కళేనని అది నల్లమిల్లి మూలారెడ్డికే దక్కిందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నా రు. అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్‌ 36వ జాతీయ స్థాయి నాటిక పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మూలారెడ్డి జడ్పీ పాఠశాల సుబ్బిరెడ్డి కళా మందిరంలో జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కళలపై ఉన్న మక్కువతో 36 ఏళ్లుగా పరిషత్‌ నిర్వహించడం సామాన్య విషయం కాదన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నల్లమిల్లి కుటు ంబానికి కళామతల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు. రుడా చైర్మన్‌ బొడ్డు వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ తండ్రి మూలారెడ్డి ఆశయాలను బతికించాలన్న తపనతో రామకృష్ణారెడ్డి పరిషత్‌ను నిరాటంకంగా నడిపించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే, పరిషత్‌ అధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి ఆటంకం కలగ కుండా పరిషత్‌ నిర్వహిస్తామన్నారు. ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసీసీబీ చైర్మన్‌ తుమ్మల రామస్వామి,జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ డైరెకర్లు కడలి ఈశ్వరి,తుమ్మల పద్మ, శిల్పి వడయార్‌, రైస్‌ మిల్లర్ల జిల్లా అధ్యక్షుడు కర్రి వెంకటరెడ్డి, పారిశ్రామికవేత్త మేడపాటి రామలింగారెడ్డి, వైద్యు లు తాడి రామగుర్రెడ్డి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చిగురు మేఘం

నాటిక ప్రదర్శనలో ఆఖరి రోజైన శనివారం రాత్రి తొమ్మిదవ నాటికగా ప్రదర్శించిన అమ రావతి ఆర్ట్స్‌ గుంటూరు వారి చిగురు మేఘం ఆకట్టుకుంది. పల్లెటూరులో పుట్టిన కల్యాణ్‌ తన పేద తల్లిదండ్రులు కష్టంతో వైద్య విద్య ను పూర్తి చేస్తాడు. ఇంతలో పట్టణంలో కార్పొరేట్‌ ఆసుపత్రి అధినేత ధనుంజయరావు కు మార్తె డాక్టర్‌ శోభనను పెండ్లాడి పట్టణంలో స్థిరపడతాడు. చివరకు తల్లిదండ్రులను పట్టించుకోలేనంత బిజీగా మారతాడు. చివరకు తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తండ్రి ఆమెను వెంటబెట్టుకుని కొడుకు దగ్గరకు చేరుకుంటాడు. శోభన ఆమె తండ్రి ధనుంజయరావు కల్యాణ్‌ తల్లిదండ్రులను అక్కడి నుంచి ఊరికి పంపే ప్రయత్నం చేయడంతో భార్యా భర్తల మధ్య వివాదాలు తలెత్తుతాయి. వారి మధ్య వాదనలు జీర్ణించుకోలేని కల్యాణ్‌ తల్లి గుండె పగిలి మరణిస్తుంది. చివరకు భార్యను, కార్పొరేట్‌ ఆసుపత్రిని వదలి పల్లెలో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు తండ్రితో పయనమవడంతో నాటిక ముగుస్తుంది.

ఉత్తమ నాటికలివే..

నాలుగు రోజుల పాటు తొమ్మిది నాటికలు ప్రదర్శించగా చైతన్య కళా భారతి కరీంనగర్‌ వారు ప్రదర్శించిన చీకటి పువ్వు ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. తెలుగు కళా సమితి విశాఖపట్నం వారు ప్రదర్శించిన నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, అమృతలహరి థియేటర్‌ ఆర్ట్స్‌ గుంటూరు వారి నాన్నా నేనొచ్చేస్తా నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా శర్వాణీ గిరిజన సాంస్కృతిక సేవా కేంద్రం బోరివంక వారు ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ఉత్తమ జ్యూరీ బహుమతి గెలుచుకొంది. ఉత్తమ రచన జనరల్‌ బోగీలు రచయిత పీటీ మా ధవ్‌, ఉత్తమ దర్శకత్వం చీకటిపువ్వు దర్శకు డు ఎం.రమేష్‌, ఉత్తమ నటుడు పిబీ వరప్రసాద్‌, ఉత్తమ నటిగా ఎస్‌.అమృత వర్షిణి ఎంపికైనట్లు న్యాయ నిర్ణేతలు ప్రకటించారు.

Updated Date - May 25 , 2025 | 01:52 AM