నారాయణరావుకు సీపీ బ్రౌన్ స్మారక అవార్డు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:31 AM
తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు రూపకర్త, తెలుగు భాషాభ్యుదయానికి ఎనలేని సేవలందించిన సీపీ బ్రౌన్ జయంతిని రాకా, గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ కంటే వీరన్నచౌదరి హాస్పిటల్ ఆవరణలోని ఎస్వీ బాలు స్మారక సాంస్కృతిక మందిరంలో ఆదివారం నిర్వహించారు.
రాజమహేంద్రవరం కల్చరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు రూపకర్త, తెలుగు భాషాభ్యుదయానికి ఎనలేని సేవలందించిన సీపీ బ్రౌన్ జయంతిని రాకా, గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ కంటే వీరన్నచౌదరి హాస్పిటల్ ఆవరణలోని ఎస్వీ బాలు స్మారక సాంస్కృతిక మందిరంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా క్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ ఆంగ్లేయులైనా సీపీ బ్రౌన్ తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. స్థా నిక గౌతమీ గ్రంథాలయంలో నేటి తరానికి పనికివచ్చే ఎన్నో వేల పురాతన తెలుగు పుస్తకాల డిజిటలైజేషన్ చేస్తూ, అంత్యప్రాస నిఘంటువును రూపుదిద్ది, వెలికితెచ్చిన అరిపిరాల నారాయణరావుకు బ్రౌన్ పురస్కారానికి ఎంపిక చేయడం ఎంతో సముచితమని అన్నారు. కార్యక్రమంలో తోట సుబ్బారావు, తిరుమల కృష్ణమోహన్, సూరపురెడ్డి తాతారావు, రాకా కార్యదర్శి జీవీ రమణ, నూజిళ్ల సూ ర్యనారాయణ, జోరా శాస్త్రి, మహమ్మద్ షా ఆలీ, ఎం.ఏడుకొండలు పాల్గొన్నారు.