మహానుభావుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:38 AM
రామచంద్రపురం(ద్రాక్షారామ), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమ పథకాలకు ఆద్యుడు దివంగత ఎన్టీఆర్ అని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మం గళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం- పసలపూడి బైపాస్ జంక్షన్‌లో సత్యంవాసంశెట్టి ఫౌండేషన్ రూ.9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నారా రోహిత్ ఆవిష్కరించారు. గజమాల వేసి నివాళుర్పించారు. ఈ సం
రామచంద్రపురంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు నారా రోహిత్
రామచంద్రపురం(ద్రాక్షారామ), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమ పథకాలకు ఆద్యుడు దివంగత ఎన్టీఆర్ అని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మం గళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం- పసలపూడి బైపాస్ జంక్షన్‌లో సత్యంవాసంశెట్టి ఫౌండేషన్ రూ.9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నారా రోహిత్ ఆవిష్కరించారు. గజమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుందని, ఆయన ఆశయాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు చిరకాలం నిలిచిపోతాయన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సుభాష్, ఎమ్మెల్యే జోగేశ్వరరావు నివాళుల ర్పించారు. అనంతరం కార్యకర్తలు నారా రోహిత్, మంత్రి సుభాష్ శిల్పి వడయార్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్‌రాయ్, గంధం పళ్లంరాజు, వాసంశెట్టి సత్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
సుందరకాండ ట్రైలర్ విడుదల
నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా ట్రైలర్‌ను మంత్రి సుభాష్ మంగళవారం విడుదల చేశారు. రామచంద్రపురం మండలం చోడవరం విజయఫంక్షన్‌హాలులో విడుదల చేసిన మంత్రి మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుందని, ఈనెల 27 న వినాయక చవితి సందర్భంగా చిత్రం విడుదల కానుందని తెలిపారు. నారా రోహిత్ సినిమా లోని డైలాగ్స్ చెప్పడంతో యువకులు కేరింతలు కొట్టారు.