Share News

ఎన్టీఆర్‌ ఆశయాలకనుగుణంగా ప్రజా సేవ

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:41 AM

రంపచోడవరం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్‌ ఆశ యాలకు అను గుణం గా ప్రజా సేవ కార్యక్ర మాలు అందించడం లో ఎన్టీఆర్‌ మెమోరి యల్‌ ట్రస్ట్‌ ముం దుంటుందని ఎన్టీఆర్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆదివారం అ ల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరంలో జీఎఎస్‌ఎల్‌, జీఎస్‌ఆర్‌ హాస్పిటల్స్‌ సహకారంతో ఎన్టీఆ

ఎన్టీఆర్‌ ఆశయాలకనుగుణంగా ప్రజా సేవ
ఎన్టీఆర్‌ విగ్రహానికి భువనేశ్వరి నివాళి

రంపచోడవరంలో మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

చిన్నారులకు పోలియో చుక్కలు

ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు

రంపచోడవరం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్‌ ఆశ యాలకు అను గుణం గా ప్రజా సేవ కార్యక్ర మాలు అందించడం లో ఎన్టీఆర్‌ మెమోరి యల్‌ ట్రస్ట్‌ ముం దుంటుందని ఎన్టీఆర్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆదివారం అ ల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరంలో జీఎఎస్‌ఎల్‌, జీఎస్‌ఆర్‌ హాస్పిటల్స్‌ సహకారంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభిం చారు. తొలుత సీతపల్లి బాపనమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంపచోడవరం వైటీసీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి చేరుకున్న భువనేశ్వరికి వేదమంత్రాలతో, ఆదివాసీలు సంప్రదాయ పద్ధతిలో, కొమ్ము నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఘజమాలతో ఘనంగా సత్కరించారు. ఆమె ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భ ంగా మాట్లాడుతూ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు వైద్య, విద్య, మహిళలకు స్వయం ఉపాధి కల్ప నే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జ రుతుందన్నారు. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రా ల్లో 16,365 మెడికల్‌ క్యాంపులు నిర్వహించి 22.64లక్షల మందికి వైద్యసేవలు అందించడం జరిగిందన్నారు. చిన్నారులకు ఆమె పోలియో చుక్కలు వేశారు. శిబిరానికి విచ్చేసిన రోగుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వైద్యసహకారం అందించాలని సంబంధిత వైద్యులను భువనేశ్వరి ఆదేశించారు. కార్య క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంక టేశ్వ రరావు, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, చిన్నం బాబు రమేష్‌, ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు గొర్లె సునీత, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్‌ మేనే జింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ రవిరామ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 01:41 AM