Share News

వైద్యులు నిరంతరం అప్‌డేట్‌ కావాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:21 AM

వైద్యుడు ప్రతి రోజు తనను తాను అప్‌డేట్‌ చేసుకోవాలని.. అప్పుడే ఉత్తమ వైద్యులుగా మారతారని ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

వైద్యులు నిరంతరం అప్‌డేట్‌ కావాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నారా భువనేశ్వరి

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వైద్యుడు ప్రతి రోజు తనను తాను అప్‌డేట్‌ చేసుకోవాలని.. అప్పుడే ఉత్తమ వైద్యులుగా మారతారని ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ హోట ల్‌లో ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన సీఎంఈ సెమినార్‌కు హాజరై మాట్లాడారు. వైద్యుడు నిరంతర విద్యార్థి అన్నారు. నిరంతర వైద్య విద్య అనే అంశంపై మాట్లాడడానికి మీ ముదుకు రావడం ఆనం దంగా ఉందన్నారు. వైద్యం, భోధన గొప్ప వృత్తులని అన్నా రు. వైద్యం అంటే స్వస్థ పర్చడం, బోధించడం, ఓదార్చడం , సేవ చేయడం అని అన్నారు. ప్రతి ఏటా కొత్త జ్ఞానం ఉద్భవిస్తుందని, పాత అంచనాలు సవాల్‌ చేస్తాయన్నారు. నిన్న ఉత్తమ అభ్యాసం అని చెప్పబడింది ఈ రోజు సరిపోక పోవచ్చునని అన్నారు. అందుకే వైద్యుడు తప్పనిసరిగా ప్రతిరోజూ అప్‌డేట్‌ అవాలన్నారు. సీఎంఈ (కంటిన్యూ మెడికల్‌ ఎడ్యు కేషన్‌) లేకపోతే సామర్థ్యం క్షీణిస్తుందన్నారు. ఈ సదస్సులో డాక్టర్‌ గోరంట్ల రవిరామ్‌ కిరణ్‌ను సత్కరించారు. ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 01:21 AM