Share News

గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:22 AM

దివాన్‌చెరువు, జూన్‌25 (ఆంధ్రజ్యోతి): సమాజానికి గురువులను అందించే బాధ్యత బీఈడీ అధ్యాపకులపై ఉంటుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ విశ్వవిద్యాలయం విద్యాకళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడుతూ గురుతర బాధ్యతను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని 40 అనుబంధ విద్యాకళాశాలల మూడో సెమిస్టర్‌ రికార్డుల మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 24న ప్రారంభమైం

గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలి
బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని పరిశీలిస్తున్న వీసీ ప్రసన్నశ్రీ

‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ

దివాన్‌చెరువు, జూన్‌25 (ఆంధ్రజ్యోతి): సమాజానికి గురువులను అందించే బాధ్యత బీఈడీ అధ్యాపకులపై ఉంటుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ విశ్వవిద్యాలయం విద్యాకళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడుతూ గురుతర బాధ్యతను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని 40 అనుబంధ విద్యాకళాశాలల మూడో సెమిస్టర్‌ రికార్డుల మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 24న ప్రారంభమైందన్నారు. విశ్వవిద్యాలయం సెమినార్‌ హాల్‌లో ఈనెల27 వరకూ ఈప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అన్నివిభాగాల కంటే విద్యావిభాగానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నా రు. గురువులకు ఉండాల్సిన మంచి లక్షణాలను తరగతి గదిలో బోధించాలని ఉత్తమ గురువులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత బీఈడీ అధ్యాపకులపై ఉందన్నారు. మూల్యాంకనానికి సంబంధించి సూచనలు, సలహాలు అందించారు. విశ్వవిద్యాలయం నుంచి వచ్చే ప్రతీ సూచన, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కెవి.స్వామి, నన్నయ విద్యాకళాశాల ప్రిన్సిపాల్‌ కె.సుబ్బారావు ఉన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:22 AM