అదృష్టం మీదే ఆధారపడొద్దు
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:37 AM
దివాన్‌చెరువు, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి): జీవితంలో కష్ట పడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వందజన్మతెత్తినా విజయాన్ని సాధించలేమని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనాజైస్వాల్ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువులోని ఢి
మనకు మనమే స్ఫూర్తి : అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడా కారిణి నైనాజైస్వాల్
దివాన్‌చెరువు, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి): జీవితంలో కష్ట పడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వందజన్మతెత్తినా విజయాన్ని సాధించలేమని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనాజైస్వాల్ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏడో వార్షికోత్సవానికి హాజరైన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయని యువతకు పిలుపునిచ్చారు. రాముడు రాయిని ఆడదిగా మార్చాడని, శివుడు గంగను తలపై మోశాడని వారిస్ఫూర్తితో మన జీవితాన్ని బంగారుజీవితం చేసుకోవాలంటే మనకు మనమే స్ఫూర్తి అని చెప్పారు. మనం తలచుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఇంతవరకూ తాను జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 40 పతకాలు గెలిచానని చెప్పారు. తల్లిదండ్రులు అండదండలుంటే అమ్మాయిలు ఏ రంగ ంలోనైనా 100 శాతం విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎం చేస్తున్నానని.. యూపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. సమావే శంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జె.ఉదయభాస్కర్, వైస్ చైర్మన్ సీ.శ్రీనివాస్, డైరెక్టర్లు కరుణదీప్, శ్రీకాంత్, ప్రిన్సిపాల్ పీ.శాస్త్రి పాల్గొన్నారు.