వక్ఫ్‌చట్ట సవరణను నిరసిస్తూ ముస్లింల భారీ ర్యాలీ
ABN , Publish Date - May 07 , 2025 | 12:24 AM
రాజమహేంద్రవరం సిటీ, మే 6(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లారాజమహేంద్రవరంలో ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాంపేట మసీదు -ఆజాద్ చౌ క్ సెంటర్‌లో మంగళవా
రాజమహేంద్రవరం సిటీ, మే 6(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లారాజమహేంద్రవరంలో ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాంపేట మసీదు -ఆజాద్ చౌ క్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన భారీ ర్యాలీలో వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ చైర్మన్ మహ్మ ద్ ఆరీఫ్ మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లు ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. భారతదేశంలో సుమారు 22కోట్ల మంది ము స్లింల ఆస్తిత్వాన్ని అస్థిరపరిచేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వక్ఫ్‌చట్టాన్ని కేంద్రం ఆమోదించడం దారుణమన్నారు. ముస్లిం ఆస్తు లను కాజేసే కుట్రలో భాగంగానే ఈ చట్టసవరణ చేశారని, ఇది భారత రాజ్యాంగానికి చీక టి రోజు అని అన్నారు. ముస్లింల ఆస్తులను ప్రభుత్వాలు తమ ఆధీనంలోకి తీసుకుని వారిని అణచివేయాలనుకోవడం ముస్లిం సమాజాన్ని భయపెట్టడమేనన్నారు. ర్యాలీలో హబీబుల్లాఖాన్, అహ్మద్ అన్సర్, కలిముల్లాఖాన్, అస్సర్, ముక్తియార్, బ్యూటీ షరీప్, డిల్లు, అసదుల్లా అహ్మద్, సల్మాన్,బాబులు రబ్బాని పాల్గొన్నారు.