Share News

యానాంలో దారుణ హత్య

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:56 AM

యానాం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): యానాం నడిరోడ్డులో దారుణ హత్య జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలానికి చెందిన తిప్పిరిశెట్టి నారాయణస్వామి (33) హత్యకు గురయ్యాడు. వివ రాల ప్రకారం.. యానాం గోపాల్‌నగర్‌కు చెందిన మోకా వెంకటేశ్వరావు(5

యానాంలో దారుణ హత్య
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ, పోలీసులు

వ్యక్తిని 10 సార్లు కత్తితో పొడిచి నిందితుడు పరారీ

ప్రతీకార హత్యగా భావిస్త్తున్న పోలీసులు

యానాం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): యానాం నడిరోడ్డులో దారుణ హత్య జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలానికి చెందిన తిప్పిరిశెట్టి నారాయణస్వామి (33) హత్యకు గురయ్యాడు. వివ రాల ప్రకారం.. యానాం గోపాల్‌నగర్‌కు చెందిన మోకా వెంకటేశ్వరావు(57)ను కాజులూరు మండలానికి చెందిన చీటీల వ్యాపారి తిప్పిరిశెట్టి నారాయణస్వామి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో 2022 మార్చి 12న మోకా వెంకటేశ్వరావు ఇంటి కొచ్చి విచక్షణా రహితంగా దాడి చేయడంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసులో పోలీసులు నారాయణస్వామిని అదుపులోకి తీసుకుని పుదుచ్చేరి జైలుకు తరలించారు. సుమారు మూడేళ్ల పాటు పుదుచ్చేరి జైల్లో ఉన్న నారాయాణస్వామి కి బెయిల్‌ రావడంతో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ యానాం పోలీస్‌స్టేషన్‌ల్లో సంతకం చేస్తున్నాడు. నారాయణస్వామి యానాం రావడాన్ని గమంచిన మోకా వెంకటేశ్వరావు తనయుడు నారాయణస్వామిని హత్య చేయడానికి పథకం వేశాడు. శనివారం సాయంత్రం యానాంలో సినిమా థియేటర్‌ ఎదురుగా నారాయణస్వామిని విచక్షణా రహితంగా కత్తితో 10సార్లు పైగా పొడిచి ఆనంద్‌ పరారయ్యాడు. రక్తపు మడుగు లో కొనఊపిరితో ఉన్న నారాయణస్వామిని స్థానికులు, సమీపంలో ఉన్న పోలీసులు ఆటోలో యా నాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన తండ్రిని హత్య చేసినందుకే ఆనంద్‌ ప్రతీకార హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని యానాం ఎస్పీ వరధరాజన్‌ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 12:56 AM