Share News

‘అనంత’పాపం బద్ధలు!

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:28 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇన్నేళ్లపాటు పూర్తిగా పక్కన పడిపోయిన కేసును తదుపరి మరింత లోతుగా విచారణ జరిగేలా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ న్యాయ స్థానం మంగళవా రం తీర్పునిచ్చింది.

‘అనంత’పాపం బద్ధలు!
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కార్‌ సీట్‌లో డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం ( ఫైల్‌)

డ్రైవర్‌ హత్య కేసులో కీలక మలుపు

తదుపరి విచారణకు అనుమతి

ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం తీర్పు

జగన్‌ ప్రభుత్వం అనంత ప్రేమ

పైపై ఆధారాలతో ఛార్జిషీట్‌

న్యాయవాది ముప్పాళ్ల పోరాటం

న్యాయం చేస్తామని లోకేశ్‌ హామీ

ఎట్టకేలకు రంగంలోకి పోలీస్‌

బెయిల్‌పై ఉన్న అనంతబాబు

(కాకినాడ/రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇన్నేళ్లపాటు పూర్తిగా పక్కన పడిపోయిన కేసును తదుపరి మరింత లోతుగా విచారణ జరిగేలా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ న్యాయ స్థానం మంగళవా రం తీర్పునిచ్చింది. పోలీసులు దాఖలు చేసిన తొలి ఛార్జిషీటులో అనేక కీలక వాస్తవాలు విస్మ రించిన నేపథ్యంలో బాధితుల విజ్ఞప్తి, ప్రాసి క్యూషన్‌ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యా యస్థానం కేసుపై 90 రోజుల్లోగా సప్లమెంటరీ ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. తాజా కోర్టు ఆదేశాలతో కేసు మరింత దర్యాప్తు నకు మార్గం సుగమమైంది.

కారులో తీసుకెళ్లి.. డెడ్‌ బాడీ తెచ్చి..

ప్రశాంత నగరంగా పేరొందిన కాకినాడ 2022 మేలో అట్టుడికిపోయింది. సీఎం జగన్‌కు అత్యం త సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్సీ అనంత బాబు 2022 మే 18న రాత్రి తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి పని ఉందని తీసుకువెళ్లి హత్య చేశాడు. మే 19 తెల్లవారు జామున మృతదేహాన్ని స్వయంగా తన కారులో అనంతబాబు డ్రైవర్‌ ఇంటికే తీసు కొచ్చాడు. పలు పరిణామాల నేపథ్యంలో అనం తబాబును అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెం ట్రల్‌ జైలుకు తరలించారు. గత వైసీపీ ప్రభు త్వం తన సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుపై అవాజ్యమైన ప్రేమ కురిపించింది. అనంతబాబు ను కాపాడేందుకు కేసును నీరుగార్చేసింది. పైపై ఆధారాలతో న్యాయ స్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో అనంతబాబు రాజమహేం ద్రవరం సెంట్రల్‌ జైల్లో కొద్దిరోజులు శిక్ష అనుభ వించి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

ఇక అన్నీ తేల్చేస్తారు..

ఈ కేసుపై రాజమహేంద్రవరంలో సీనియర్‌ న్యాయవాది, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పా ళ్ల సుబ్బారావు 2018లో తీవ్ర పోరాటం చేశారు. బెయిల్‌ రద్దు, విచారణ లోతుగా జరిగేలా కృషి చేశారు. అనంతబాబుపై గతంలో రౌడీషీట్‌ లేద ని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొనడంపైనా పిటి షన్‌ దాఖలు చేశారు. రౌడీషీట్‌ ఉందని నిరూ పించారు. న్యాయం కోసం బాధితులను వెంట బెట్టుకుని హైకోర్టు వరకు వెళ్లారు. అయితే వైసీ పీ ప్రభుత్వ పెద్దల సహకారంతో కేసు నీరుగారి పోయింది. గతేడాది ప్రభుత్వం మారాక కేసు విచారణ మలుపు తిరిగింది. ఎన్నికల సమ యంలో బాధితులు నారా లోకేశ్‌ను యు.కొత్తప ల్లి సభలో కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామ ని లోకేశ్‌ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం మారాక ఈ ఏడాది మార్చి నుంచి కేసులో వేగం పెరిగింది. ఈ కేసుపై తొలి నుంచీ పోరాటం చేస్తోన్న ముప్పాళ్లను ప్రాసి క్యూషన్‌ కు సహకరించేందుకు వీలుగా ఏప్రిల్‌ 17న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కేసు తదుపరి విచారణకు అను మతివ్వాలని కోరుతూ ప్రాసిక్యూషన్‌ రాజమ హేంద్రవరం అట్రాసిటీ న్యాయ స్థానంలో పిటి షన్‌ దాఖలు చేసింది. హత్య అనంతరం జరిగిన దర్యాప్తులో అనేక కీలక అంశాలను విస్మరించిన నేపథ్యంలో లోతుగా కేసును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొంది.తదుపరి విచారణకు అనుమతి మంజూరు చేయాలని కోరింది. మరోపక్క మృతుడి తల్లి నూకరత్నం సైతం తన కుమారుడి హత్య కేసులో తనకు అనుమానాలున్న విషయంపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసిన అంశాన్ని పిటిషన్‌లో ప్రాసి క్యూషన్‌ ప్రస్తావించింది. ఈ కేసును తదుపరి విచారించేందుకు వీలుగా పాటిల్‌ దేవరాజ్‌ మనిష్‌ అనే ఐపీఎస్‌ అధికారిని కాకినాడ జిల్లా ఎస్పీ నియమించిన విషయాన్ని పిటిషన్‌లో ప్రాసిక్యూషన్‌ ప్రస్తావించింది. హత్య కేసులో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉండడం, మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో తదుపరి విచారణకు అనుమతి కోరింది. ఈ మేరకు మంగళవారం రాజమహేం ద్రవరంలోని అట్రాసిటీ న్యాయస్థానం కేసు తదుపరి విచారణకు అనుమతివ్వడంతో మరింత లోతుగావిచారణ జరగనుంది.

తల్లి ఫిర్యాదు.. సిట్‌ టీమ్‌

తన కుమారుడి హత్య కేసులో తనకు అనుమా నాలున్నాయని ఇప్పటికే డీజీపీకి మృతుడి తల్లి నూకరత్నం ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపీ కార్యాలయం నుంచి కాకినాడ ఎస్పీ బిందుమా ధవ్‌కి వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని ఆదేశా లు అందాయి. విచారణకు డీఎస్పీ స్థాయి అధి కారులను నియమించడంతోపాటు 60 రోజుల్లో నివేదిక ఇచ్చి తదుపరి యాక్షన్‌కు కోర్టును అనుమతి కోరాలని ఆదేశించారు. ఈ ఏడాది కేసు విచారణకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను నియమిస్తూ కాకినాడ ఏఎస్పీ పి.దేవ రాజ్‌ మనీష్‌ మెమో జారీచేశారు. ఆ టీమ్‌లో సీసీఎస్‌ సీఐ వి.కృష్ణ, ఎస్‌ఐలు బి.వినయ్‌ప్రతా ప్‌, పి.శ్రీనివాస్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ కె. రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎం.సతీష్‌ ఉన్నారు.

కేసుపై మళ్లీ విచారణ

లోతైన విచారణ చేయడంతోపాటు 90 రోజుల్లో అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేయాలని కోర్టులో దాఖలైన పిటిషన్‌పై రాజమహేంద్రవరం ఎస్సీ,ఎస్టీ అట్రాసి టీ కేసుల పరిష్కార న్యాయస్థానం న్యా యమూర్తి సింగవరపు ఉమా సునంద మంగళవారం తీర్పు ఇచ్చారు. దీంతో అనంతబాబు వ్యవహారం మళ్లీ చర్చనీ యాంశమైంది. ఈ నేపథ్యంలో అనంత బాబుపై తిరిగి పూర్తి విచారణ జరగ నుంది. న్యాయసలహాదారుగా న్యాయ వాది ముప్పాళ్ల సుబ్బారావు.. పీపీలు కె. రాధా కృష్ణ, డి.శ్రీవాణి వాదించారు.

ఎవరూ తప్పించుకోలేరు..

దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన కేసులో ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం సిట్‌ను నియమించింది.. సిట్‌ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 90 రోజుల్లో అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసి కోర్టుకు సమర్పించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అనంత బాబును కాపాడడానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. కానీ ప్రజా పోరాటాల వల్ల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆనాటి కాకినాడ ఎస్పీ, ఇతర అధికారులు అనేక తప్పిదాలు చేశారు.ఈ కేసులో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో తేల్చే అవకాశాలు ఉన్నాయి.

- ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది

Updated Date - Jul 23 , 2025 | 01:28 AM