Share News

తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య కేసు..

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:38 AM

సామర్లకోట, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా సామర్లకోట సీతారామ దళిత కాలనీ లోని ఓ ఇంటిలో తల్లి,ఇద్దరు కుమార్తెలను దారు ణంగా హతమార్చిన వ్యక్తిని సామర్లకోట పోలీ సులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. శనివారం అర్ధరాత్రి ఈ హత్యోదంతం అనంతరం సామర్లకోట

తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య కేసు..

పోలీసుల అదుపులో నిందితుడు!

సామర్లకోట, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా సామర్లకోట సీతారామ దళిత కాలనీ లోని ఓ ఇంటిలో తల్లి,ఇద్దరు కుమార్తెలను దారు ణంగా హతమార్చిన వ్యక్తిని సామర్లకోట పోలీ సులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. శనివారం అర్ధరాత్రి ఈ హత్యోదంతం అనంతరం సామర్లకోట నుంచి సదరు అను మానితుడు పొరుగు జిల్లాకు వెళ్లిపోగా సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు వెళ్లి మాటు వేసి పట్టుకున్నట్టు సమాచారం. ఈ హత్యలకు సామర్లకోటకు చెందిన తలే సురేష్‌ పాల్పడిన ట్టు పోలీసుల వద్ద పక్కా సమాచారం లభించ డంతో అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలి సింది. అయితే ఈ హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని పోలీసుల ప్రాథ మిక దర్యాప్తులో తేలింది. స్థానిక కోట్లమ్మచెర్వు ప్రాంతానికి చెందిన సురేష్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడని, మృతురాలి ఇంటికి గత కొంత కాలంగా రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం పోలీసులకు లభించినట్టు తెలిసింది.

పోస్టుమార్టంలో విస్తుపోయే అంశాలు

హత్యకు గురైన తల్లి,కుమార్తెల మృత దేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యులు విస్తు పోయినట్టు విశ్వసనీయ సమాచారం. మాధురి తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యేలా కొట్టి నట్టు, పెద్దకుమార్తె అయిన పుష్పకుమారిని తల పైభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యిందని తెలు స్తోంది. చిన్న కుమార్తె జెస్సీని తలపై కొట్టడంతో బాటు గొంతు, గుండెలపై తొక్కడంతో రిబ్స్‌ ఎముకలు విరిగిపోయినట్టు పోస్టుమార్టం సమ యంలో వైద్యులు గుర్తించినట్టు సమాచారం.

Updated Date - Aug 05 , 2025 | 12:38 AM