Share News

జంట హత్యల కేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:14 AM

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24( ఆం ధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం నామవరం శాటిలైట్‌ సిటీలో జరిగిన తల్లీకూతురి హత్య కేసులో నిందితుడు పల్లి శివకుమార్‌ను అరె స్టు చేసినట్టు ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ బి.విద్య తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఓ ప్ర కటన విడుదల చేశారు

జంట హత్యల కేసులో నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ విద్య

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24( ఆం ధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం నామవరం శాటిలైట్‌ సిటీలో జరిగిన తల్లీకూతురి హత్య కేసులో నిందితుడు పల్లి శివకుమార్‌ను అరె స్టు చేసినట్టు ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ బి.విద్య తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఓ ప్ర కటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో లైట్‌ మెన్‌గా పనిచేస్తూ పరిచయమైన శ్రీకాకుళం జిల్లా కొత్తవీధి నందిగామ మండలానికి చెం దిన శివకుమార్‌, సుమ్యా ప్రేమించుకున్నారు. తండ్రి మరణించడంతో తల్లి సాల్మాతో కలిసి రాజమహేంద్రవరం రూరల్‌ మండలం నామవరం శాటిలైట్‌ సిటీలోకి 3నెలల క్రితం సు మ్యా వచ్చి ఇక్కడే ఉంటోంది. కొంతకాలంగా శివకుమార్‌ వచ్చి వెళ్తున్నాడు. ఇటీవల సు మ్యా వేరొకరితో ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన శివకుమార్‌ నామవరం వచ్చి ఆది వారం రాత్రి తల్లి సాల్మాను నిలదీశాడు. సు మ్యాను సాల్మానే ప్రోత్సహిస్తుందని ఆమెతో గొడవపడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున ఫోను మాట్లాడేందుకు సుమ్యా మేడపైకి వెళ్లిన సమయంలో వారి వంట గదిలో ఉన్న కత్తిని తీసుకుని మంచంపై పడుకున్న సా ల్మా గొంతుకోసి అటుపై తలుపు పక్కనే వేచి ఉంచి సుమ్యా లోపలికి వచ్చే క్రమంలో ఆమె పై దాడి చేసి హత్య చేశాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. కొవ్వూరు రూరల్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. సోమవారం నిందితుడిని కొవ్వూరు నుంచి తీసుకువచ్చి అరెస్టు చేసినట్టు చెప్పారు. మరో పక్క సాల్మా, సుమ్యా మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Updated Date - Mar 25 , 2025 | 12:14 AM