Share News

వ్యక్తి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:40 AM

పిఠాపురం, అక్టోబరు 22 (ఆంద్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన తమిళనాడుకు చెందిన వ్యక్తి హత్య కేసులో ఐదుగురిని పోలీ

వ్యక్తి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

నిందితుల అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న పిఠాపురం సీఐ శ్రీనివాస్‌, చిత్రంలో సర్కిల్‌లోని ఎస్‌ఐలు

పిఠాపురం, అక్టోబరు 22 (ఆంద్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన తమిళనాడుకు చెందిన వ్యక్తి హత్య కేసులో ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్‌ వెల్లడించారు. పిఠాపురం పట్టణ శివారులోని ఆర్వోబీ సమీపంలో గల వాసంశెట్టి పెద్దిరాజు పొలంలో తల, శరీరంపై గల గాయాలతో మరణించి ఉన్నట్టు వీఆర్వో కామేశ్వరరావు ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఈనెల 8న పిఠాపురం పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాస్‌ ఆధ్వ ర్యంలో పట్టణ, రూరల్‌, కొత్తపల్లి ఎస్‌ఐలు మణికుమార్‌, జానీబాషా, వెంకటేష్‌ ఆధ్వర్యంలో 3 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.

సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, సాక్షుల కథనాల ఆధారంగా విచారణ సాగించి మృతు డిని తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా మైలాడంబారై ప్రాంతంలోని కొమనపంతుల పంచాయతీ మనుతు గ్రామానికి చెందిన పాండేగా గుర్తించారు. ఇతడు హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంత ంలోని తినుబండారాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇతడికి అక్కడ తమిళనాడు రాష్ట్రం తూతికూడి జిల్లా పెరియసామిపురం ప్రాంతానికి చెందిన పౌల్‌రాజ్‌ ఆండోనీ, లార్డు పకియం, మేల్మండా గ్రామానికి చెందిన మడసామి కారుప్పస్వామితో పరిచయం ఏర్పడింది. వీరు అక్కడే పనిచేసే పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీకి చెం దిన పూచి ధనలక్ష్మి (ధనమ్మ) భర్త రామస్వామి కి ఆరోగ్యం బాగోలేక పోవడంతో పరామర్శకు వచ్చారు. అక్కడ పాండే ధనమ్మతో అసభ్యకరం గా ప్రవర్తించినట్టు చెప్తున్నారు. దీంతో 7వ తేదీ రాత్రి ఆండోని, ధనమ్మ, పకియం, సామి, పిఠాపు రం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ చాగంటి గణేష్‌తో కలిసి పాండేను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిని కొత్తపల్లి గ్రామ శివారులో అరెస్టు చేసి బుధవా రం కోర్టులో హాజరుపరిచారు. కాగా హత్యకు గల కారణాలపై పోలీసులు చెప్తున్న వివరాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి విషయంలో వారి మధ్య జరిగిన ఘర్షణే హత్యకు దారి తీసినట్టు సమాచారం. ఇదే విషయం పట్టణంలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

Updated Date - Oct 23 , 2025 | 12:40 AM