స్నేహితుడిని హత్య చేసిన నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:48 AM
కాకినాడ క్రైం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడని చూడకుండా బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను కాకినాడ టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాకినాడ ఎస్ డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌డీపీ వో మనీష్ దేవరాజ్ పా
కాకినాడ క్రైం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడని చూడకుండా బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను కాకినాడ టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాకినాడ ఎస్ డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌డీపీ వో మనీష్ దేవరాజ్ పా టిల్ నిందితుల వివరా లను వెల్లడించారు. కాకినాడ సినిమా రోడ్డులోని స్టేట్‌బ్యాంకు వీధి కి చెందిన మీసాల గౌతమ్‌ను (28) స్థాని క రేచర్లపేటలో అతడు ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద అతడి స్నేహితులైన నలుగురు కాం క్రీట్ సిమెంట్ రాయితో ఈనెల 27న తలపై విచక్షణ రహితంగా మోది హతమార్చి పరారైన విషయం తెలిసిందే. అనంతరం ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో ఎస్‌డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక సామర్లకోట రోడ్డులో ఉన్న కోటిపల్లి రైల్వేబ్రిడ్జి దగ్గరలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. రేపర్లపేటకు చెందిన యాదాల దుర్గాప్రసాద్ (25), యాదాల నవీన్ కుమార్ (29), బ్యాంక్‌పేటకు చెందిన మహ్మద్ సందాని అలి యాస్ సన్ని (32), సాంబమూర్తినగర్‌కు చెందిన షేక్ ఇమ్రా న్‌లు(25)గా నిర్ధారించారు. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే అక్కసుతో క్షణికావేశంలో స్నే హితుడు గౌతమ్‌ను హత్యచేసినట్టు నిందితు లు విచారణలో తెలిపారని ఎస్‌డీపీవో చెప్పారు.