కాకినాడలో పట్టపగలు హత్య
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:54 AM
కాకినాడ క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చెప్పులు కుట్టుకునే చిరు కార్మికుడిని ఆటో డ్రైవ ర్ చేసిన సంఘటన మంగళవారం కాకినాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామా నికి చెందిన కీర్తి సత్యన్నారాయణ (45) వ్యక్తిగత కారణాలతో భార్య, బిడ్డలను వదిలివేసి 10 ఏళ్ల క్రితం కాకినాడ వచ్చేశాడు. స్థానిక రేచర్లపేటకు చెందిన రాళ్ళ మేరీ అనే మహిళతో అ
చెప్పులు కుట్టుకునే కార్మికుడిని
చంపి పరారైన ఆటోడ్రైవర్
పట్టుకున్న పోలీసులు
కాకినాడ క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చెప్పులు కుట్టుకునే చిరు కార్మికుడిని ఆటో డ్రైవ ర్ చేసిన సంఘటన మంగళవారం కాకినాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామా నికి చెందిన కీర్తి సత్యన్నారాయణ (45) వ్యక్తిగత కారణాలతో భార్య, బిడ్డలను వదిలివేసి 10 ఏళ్ల క్రితం కాకినాడ వచ్చేశాడు. స్థానిక రేచర్లపేటకు చెందిన రాళ్ళ మేరీ అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడి అదికాస్తా సహజీవనానికి దా రితీసింది. ఈ క్రమంలో సత్యన్నారాయణ సిని మా రోడ్డులోని సంతచెరువు కూడలిలో కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వారి ద్దరూ మద్యానికి బానిస కావడంతో రోజు సా యంత్రం ఫూటుగా మద్యం తాగేవారు. ఈ నేపథ్యంలో సత్యన్నారాయణ సోమవారం రాత్రి మద్యం తాగి దుమ్ములపేటకు చెందిన ఆటో డ్రైవర్ అత్తిలి రంగాను అతడి తల్లిని దూషిస్తూ కారణం లేకుండా వాగ్వివాదానికి దిగా డు. అనంతరం గొడవ సద్దుమణిగింది. అయి తే మంగళవారం మధ్యాహ్నం సత్యన్నారాయణ చెప్పులు కుట్టేపనిలో నిమగ్నమై ఉండగా ఆటో డ్రైవర్ రం గా అక్కడికి మద్యం తాగి వచ్చి తన తల్లిని ఎం దుకు దూషించావని ప్రశ్నించాడు. దానికి సత్యన్నారాయణ ఆ విషయం గుర్తులేదని చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రంగా కోపోద్రిక్తుడై చెప్పులుకుట్టేందుకు వినియోగించే పదునైన రంపిని సత్యన్నారాయణ గుం డెల్లో దింపి అక్కడ నుంచి పరారయ్యాడు. సత్యన్నారాయణ తీవ్ర రక్తస్రావంతో పరిగెడుతూ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుప్పకూలిపోయాడు. అది గమనించిన పోలీసులు క్షతగాత్రుడిని జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకు న్న ఎస్పీ జి.బిందుమాధవ్, కాకినాడ ఎస్‌డీపీవో దేవరాజ్ మనీష్‌పాటిల్ సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీమ్ రంగంలోకి దిగి నిందితుడి వేలి ముద్రలు సేకరించింది. హత్య జరిగిన మూడు గంటల్లోనే నిందితుడు రంగాను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ కె.సత్యన్నారాయణ తెలిపారు. కాకినాడ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.