ఉగ్రవాదాన్ని భారత్ సహించదు
ABN , Publish Date - May 26 , 2025 | 01:00 AM
ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన వి డుదల చేశారు.భారత్‌పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల్లో ఎంపీ పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ఆదివారం పారిస్‌కు బయలుదేరి వెళ్లింది.పహల్గాం ఉగ్రదాడి లో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి అంతర్జాతీయ వేదికలపై ఈ బృందం వివరిస్తుంది. ఫ్రాన్స్, యూకే, ఈయూ, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించి జూన్ 8వ తేదీన తిరిగి భారత్ చేరుకుంటుంది. ఈ బృందంలో పురందేశ్వరితో పాటు బీజేపీ ఎంపీ సామిక్ భట్టాచార్య, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ అమర్‌సింగ్, నామినేటెడ్ ఎంపీ గులాం ఆలీ ఖటాన, ఎంజే అక్బర్, పంకజ్ శరణ్ ఉన్నారు.