Share News

సెంట్రల్‌ జైల్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:45 AM

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎ4, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

సెంట్రల్‌ జైల్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి
సెంట్రల్‌ జైలు వద్ద వైసీపీ శ్రేణుల హంగామా..

ఆగస్టు 1 వరకు రిమాండ్‌

రాజమహేంద్రవరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎ4, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. విజయ వాడ ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్‌ విధించడంతో సిట్‌ టీమ్‌ డీజీ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 8.38 గంటలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు.జక్కంపూడి గణేష్‌, కొందరు యువకు లు వైసీపీ జెండాలతో వచ్చి సెంట్రల్‌ జైలు ఎదురుగా రోడ్డుపై సుమా రు 2 గంటల పాటు బైఠాయించి హంగామా సృష్టిం చారు.పోలీసులు ముందుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడంతో నేరుగా జైలు గేటు వరకూ వైసీపీ కార్య కర్తలు, నేతలు వచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై సెంట్రల్‌ జైల్‌ రోడ్‌ అటూ ఇటూ బ్లాక్‌ చేశారు. ఇన్‌చార్జి ఎస్పీ మురళీకృష్ణ నాయకత్వంలో అడిషనల్‌ ఎస్పీలు సుబ్బరాజు, చెంచురెడ్డి, ముగ్గురు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సుమా రు 60 మంది పోలీసులు అక్కడ మోహరించారు. నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. రోప్‌ పార్టీ వచ్చింది. సెంట్రల్‌ జైలు వద్ద సెక్షన్‌ 30 అమల్లో ఉందని.. రోడ్డుపై ఎవరూ ఉండవద్దని హెచ్చ రించారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, అప్పిరెడ్డి సెంట్రల్‌ జైలు ప్రధాన గేట్‌ వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీ సులు అడ్డుకు న్నారు.దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. అడిషనల్‌ ఎస్పీ మురళీకృష్ణ వారిద్దరినీ బయటకు పంపించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌,మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, గూడూరి శ్రీనివాస్‌ తదితరులు సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చారు. ముందుగా పెద్ద హడావుడి చేసిన వైసీపీ శ్రేణులు మిఽథున్‌రెడ్డిని తీసుకొచ్చిన సమయంలో కిక్కురుమనక పోవడం గమనార్హం. జైలు అధికారులు వైసీపీ నేతలను ఎవరినీ లోపలకు అనుమతించ లేదు. జైలు అధికారులు లాంఛనాలు పూర్తిచేసి ఎంపీ మిథున్‌రెడ్డిని సెంట్రల్‌ జైలు రిమాండ్‌లో ఉంచారు.

Updated Date - Jul 21 , 2025 | 12:45 AM