Share News

పెదపట్నంలంకలో ‘రాజీ.. నో కాంప్రమైజ్‌’

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:13 AM

మామిడికుదురు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పెదపట్నంలంకలో రాజీ... నో కాంప్రమైజ్‌ అనే సినిమా షూటింగ్‌ శనివారం ప్రారంభించారు. వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం దర్శకుడు గెద్దాడ ప్రసాద్‌ చిత్రీకరణను ప్రారంభించారు. రాజీ... మంచి మొగుడు కావాలని దేవుడికి

పెదపట్నంలంకలో ‘రాజీ.. నో కాంప్రమైజ్‌’
పెదపట్నంలంకలో రాజీవ్‌ కనకాల, హీరోయిన్‌పై చిత్రీకరిస్తున్న సన్నివేశాలు

సినిమా షూటింగ్‌ ప్రారంభం

మామిడికుదురు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పెదపట్నంలంకలో రాజీ... నో కాంప్రమైజ్‌ అనే సినిమా షూటింగ్‌ శనివారం ప్రారంభించారు. వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం దర్శకుడు గెద్దాడ ప్రసాద్‌ చిత్రీకరణను ప్రారంభించారు. రాజీ... మంచి మొగుడు కావాలని దేవుడికి దణ్ణం పెట్టుకో అమ్మా అంటూ కథానాయిక జయశ్రీకి తండ్రి పాత్రధారి రాజీవ్‌ కనకాల చెప్పిన సీన్‌తో షూటింగ్‌ ప్రారంభమైంది. కుటుంబ కథా చిత్రంగా సాగే ఈ చిత్రాన్ని 4రోజులు పెదపట్నంలంకలో చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. పల్లెటూరు వాతావరణంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. షూటింగ్‌ను తిలకించడానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు.

Updated Date - Nov 23 , 2025 | 12:14 AM