Share News

పవన్‌, మోహన్‌బాబు సినిమాలకు పాటలు రాశా

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:20 AM

పి.గన్నవరం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సామాజిక ఉద్యమ గీతాలకు సంబంధించి ఇప్పటి వరకు 1000 వరకు పాటలు రాశానని ప్రముఖ సినీగేయ రచయిత గంగాధరి మాస్ట ర్‌జీ అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం జన సేన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణను కలిసిన ఆయన ఆంధ్రజ్యోతి

పవన్‌, మోహన్‌బాబు సినిమాలకు పాటలు రాశా
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కలిసిన ప్రముఖ సినీ గేయ రచయిత మాస్టర్‌జీ

ప్రముఖ సినీగేయ రచయిత మాస్టర్‌జీ

పి.గన్నవరం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సామాజిక ఉద్యమ గీతాలకు సంబంధించి ఇప్పటి వరకు 1000 వరకు పాటలు రాశానని ప్రముఖ సినీగేయ రచయిత గంగాధరి మాస్ట ర్‌జీ అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం జన సేన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణను కలిసిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఇప్పటివరకు 25 సినిమాల్లో పాట లు రాశానని... ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌, మో హన్‌బాబు సినిమాలకు పాటలు రాశానని చె ప్పారు. రంగులకల, అడవి నాతల్లిరో, మనో రమ సినిమాల్లో పాటలు పాడానని, 6 సినిమాల్లో నటించానని చెప్పారు. ముఖ్యంగా తాను రాసిన అందుకో దండాలు బాబా అంబేడ్కరా, పవన్‌ కల్యాణ్‌ నటించిన జానీ సినిమాలో నారాజు గాకుర మా అన్నయా, గుడుంబా శంకర్‌ సిని మాలో కిల్లి కిల్లి నమిలాకా బాగున్నదే నాగమల్లి పాటలకు మంచి స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. తెలుగు యునివర్శిటీ, అచార్య నాగార్జున యునివర్శిటీ, తెలుగు అకాడమీల నుంచి అవార్డులు పొందానని చెప్పారు. ప్రస్తు తం రెండవగది సినిమాతో పాటు మరో కొత్త సినిమాకు పాటలు రాస్తున్నాని చెప్పారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లోని జరగనున్న విశ్వజన కళామండలి 49వ వార్షికోత్సవ కార్య క్రమానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ఆహ్వానిం చడానికి వచ్చినట్టు మాస్టర్‌జీ పేర్కొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:20 AM