Share News

ఆహ్లాదం మాటున అపాయం

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:13 AM

మోతుగూడెం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండ లం మోతుగూడెం, పొల్లూరు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఎంతో అభివృద్ధి చెందాయి. నిత్యం పర్యాటకులు వస్తుంటారు. కానీ ఇక్కడి వాగులు మృత్యుకేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడి ప్రమాదకర పరిస్థితులను ప

ఆహ్లాదం మాటున అపాయం
ధారాలమ్మ గుడి పరిధిలో పిక్నిక్‌ స్పాట్‌ వద్ద ప్రవహిస్తున్న సీలేరు నది

మృత్యుకేంద్రాలుగా చింతూరు మండలంలో వాగులు

ప్రమాదాల బారిన పర్యాటకులు

హెచ్చరిక బోర్డులను లెక్కచేయని యువకులు

మోతుగూడెం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండ లం మోతుగూడెం, పొల్లూరు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఎంతో అభివృద్ధి చెందాయి. నిత్యం పర్యాటకులు వస్తుంటారు. కానీ ఇక్కడి వాగులు మృత్యుకేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడి ప్రమాదకర పరిస్థితులను పర్యాటకులు ఏ మాత్రం పట్టించుకోకుండా అతిచేష్టలకు పోతుండటం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతున్నా రు. ప్రమాదకర పర్యాటక ప్రదేశాల వద్ద అవగాహన కల్పిస్తూ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసిన వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానికులు చెప్పే మాటలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా వాగుల్లో దిగి నేరుగా మృత్యుఒడికి చేరుతున్నారు. తులసిపాక వ్యూ పాయింట్‌, మన్యం కొండవాగులు, జలపాతాలు ప్రమాదకరంగా మారాయి. పైకి చాలా చిన్నగా కనిపించే ఈ వాగుల్లో అమితమైన లోతు ఉండడంతో పాటు ప్రమాదకరమైన ఊబులు, మొసళ్లు కూడా ఉంటున్నాయి. పైగా వాగుల్లో పెద్ద రాళ్లు ఉండడంతో వాటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా సోకులేరు వాగు ధారాలమ్మ గుడి పిక్నిక్‌స్పాట్‌, పొల్లూరు జలపాతం వాగులు కూడా ప్రమాదకరంగా మారాయి. మా రేడుమిల్లి ప్రాంతంలోని జలతరంగా అమృత ధార, పొల్లూ రు జలపాతాల్లోను జరిగిన అనేక ప్రమాదాల్లో పర్యాటకులు మృత్యువాత పడ్డారు.

హెచ్చరికలు బేఖాతరు

జలపాతాలు, కొండవాగుల వద్ద పర్యాటకుల ను దిగవద్దని, చాలా ప్రమాదకరమని హెచ్చరి స్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా పర్యాటకులు అత్యుత్సాహంతో వాటిలో దిగుతున్నారు. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. సోకులేరు సీలేరు నది పైకి నిర్మలంగా కనిపిస్తున్న కింద అతి ప్రమాదకరమైన ఊబులు ఉన్నాయి. వాటిపై పర్యాటకులను హెచ్చరిస్తూ పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. అ యితే అధికశాతం యువకులు అదే బోర్డు వద్ద తరుచూ మరణిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకుల్లో అధికంగా యువకులు ఉంటారు. వారు మద్యం తాగి స్థానికులు హెచ్చరించినా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. పైగా ఈ వాగు కనిపించడంతో ప్రమాదమని హెచ్చరించినా హేళన చేయడం పరిపాటిగా మారింది.

Updated Date - Jun 23 , 2025 | 12:13 AM