నేపాల్‌లో చిక్కుకున్న తల్లీకూతురు
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:06 AM
నేపాల్ పర్యటనకు వెళ్లి అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా చిక్కుకున్న తెలుగువారిలో కాకినాడ నగరానికి చెందిన తల్లీకూతుళ్లు ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యు ల్లో ఆందోళన నెలకొంది.
3న టూరిజం ప్యాకేజీలో పర్యాటకులతో కలిసి పయనం
నేడు ప్రత్యేక విమానంలో రాక
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
నేపాల్ పర్యటనకు వెళ్లి అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా చిక్కుకున్న తెలుగువారిలో కాకినాడ నగరానికి చెందిన తల్లీకూతుళ్లు ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యు ల్లో ఆందోళన నెలకొంది. కాకినాడ నగరానికి చెందిన బుద్ధరాజు సత్యనారాయణ భార్య బుద్ధరాజు సరళ(65), కుమార్తె దాట్ల రోజారాణి(45) నేపాల్‌లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల ను తిలకించేందుకు ఈనెల 3వతేదీ ఉదయం విశాఖనుంచి 38మంది పర్యాటకులతో కలిసి బయలుదేరి వెళ్లారు. పదిరోజుల ప్రత్యేక టూరిజం ప్యాకేజీలో భాగంగా అన్నిముఖ్యమైన ప్రాంతాలను తిలకించి ఈనెల 13న వీరంతా తిరిగి వైజాగ్ చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఆ బృందం దాదాపుగా అన్నిప్రాంతాలను తిలకించారు. ఈ నెల 7న కాట్మండులోని గౌషాలాలో వీరు బస చేసిన హోటల్ రాయల్ కుసుమ్‌కు చేరుకున్నా రు. ఇంతలో నేపాల్‌లో నెలకొన్న ఆందోళన పరిస్థితులు, హింసాత్మక సంఘటనలతో వీరు హోటల్‌నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని కుమార్తె దాట్ల రోజారాణి తన తండ్రి సత్యనారాయణ, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు సంజయ్‌వర్మలకు తెలియజేయడంతో వా రు విషయాన్ని ఫోన్ ద్వారా మంత్రి నారాలోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన బాధితుల తో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్నిచ్చారు. మరోవైపు కాట్మం డులో కాకినాడకు చెందిన తల్లీకూతురు చిక్కుకోవడంపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పందించారు. ఆయన కూడా మంత్రి లోకేశ్‌కు విషయాన్ని తెలిపారు. నేపాల్ లో చిక్కుకున్న వారందరినీ క్షేమంగా ఇంటికి చే ర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన భా ర్య సరళ, కుమార్తె రోజారాణి క్షేమంగానే ఉన్నా రని, గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ, అక్కడినుంచి కాకినాడ చేరుకుంటారని బుద్ధరాజు సత్యనారాయణ తెలిపారు.