Share News

బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:09 AM

తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని రాజానగరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో జి.గౌరమ్మ అన్నారు. అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా దివాన్‌చెరువు-4 అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశానికి సీడీపీవో ముఖ్యఅతిథిగా వి చ్చేసి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ బిడ్డకు అందించవలసిన ముర్రుపాలను, వాటిలో ఉండే పోషకాలను వివరించారు.

బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం
దివాన్‌చెరువులో మాట్లాడుతున్న సీడీపీవో గౌరమ్మ

  • ఐసీడీఎస్‌ సీడీపీవో గౌరమ్మ

  • ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు

  • పలుచోట్ల అవగాహన సదస్సులు

దివాన్‌చెరువు, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని రాజానగరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో జి.గౌరమ్మ అన్నారు. అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా దివాన్‌చెరువు-4 అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశానికి సీడీపీవో ముఖ్యఅతిథిగా వి చ్చేసి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ బిడ్డకు అందించవలసిన ముర్రుపాలను, వాటిలో ఉండే పోషకాలను వివరించారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి కలిగే లాభాలను చెప్పారు. తల్లి తీసుకోవలసిన ఆహార నియమాలను తెలియజేశా రు.కార్యక్రమంలో ఏసీడీపీవో టి.కనకవల్లి, సూపర్‌వైజర్‌ వి.మేరి, ఏఎన్‌ఎం పి.కావ్య అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, ఆశాకార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 01:10 AM