తునిలో విషాదం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:40 AM
తుని రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విషాదం జరిగింది. ఓ బాలింత పండంటి కవలలకు జన్మనివ్వగా ఆ ఆనందం ఎంతోసేపు నిలవ లేదు. ఆ తల్లి కొన్ని గంటల్లోనే మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... తుని మండలం టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన కాపరపు రత్నకుమారి (29)నెలలు నిం
ఏరియా ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చి బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
తుని రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విషాదం జరిగింది. ఓ బాలింత పండంటి కవలలకు జన్మనివ్వగా ఆ ఆనందం ఎంతోసేపు నిలవ లేదు. ఆ తల్లి కొన్ని గంటల్లోనే మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... తుని మండలం టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన కాపరపు రత్నకుమారి (29)నెలలు నిండడంతో కుటుంబసభ్యులు శుక్రవారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. శనివారం ఉదయమే ఆమెకు డెలివరీ అయిం ది. ఇద్దరు కవల మగబిడ్డలకు జన్మనిచ్చింది. అనంతరం ఆసు పత్రి సిబ్బంది వార్డుకు తరలించారు. అయితే కొద్దిసేపటికే రత్నకుమారికి రక్తస్త్రావం ప్రారంభమైందని ఎన్నిసార్లు చెప్పినా వైద్యు లు, సిబ్బంది కానీ పట్టించుకోలేదని బంధువులు తెలిపారు. సూపరింటిండెంట్‌కు ఫిర్యాదు చేసి నా ఆమె నుంచి కనీస స్పందన లేకపోయిందని చెప్పారు. రాత్రి అత్యవసరంగా కాకినాడ తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పారని, అంబు లెన్స్‌లో కాకినాడ తీసుకెళుతుంటే అన్నవరం చేరుకునే సరికి పరిస్థితి మరింత విషమించిందని అంబులెన్స్ సిబ్బంది సూచనల మేరకు మళ్లీ తుని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు బంధువులు తెలిపారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని చెప్పకుండా ఆసుపత్రి సిబ్బంది కొద్దిసేపు చికిత్స చేసినట్టు నటిం చారని ఆరోపించారు. పరిస్థితి బాగోకపోతే సకాలంలో చెప్తే సరిపోయేదని, వారు పట్టించుకోకుండా బాలింత మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియా ఆసుపత్రికి భారీ సంఖ్యలో మృతురాలి బంధువులు, తిమ్మాపురం గ్రామస్తులు చేరుకోవడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బంధువుల రోదనలతో ఏరియా ఆసుపత్రి ప్రాంగణం విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డుపై బైఠాయింపు
బాలింత మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ బాలింత బంధువులు, తిమ్మాపురం గ్రామస్తులు తుని ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై టెంట్ వేసి బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పెద్దాపురం డీఎస్పీ, స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన విరమించాలని వారి చెప్పే ప్రయ త్నం చేసినా ఫలితంలేకపోయింది. స్థానిక నాయకులు, ఆసుపత్రి అధికారులు బాలింత బంధువులతో పలు దఫాలు చర్చలు నిర్వహించి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆందోళన విరమించి బాలింత మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
విచారణకు కలెక్టర్ ఆదేశం
కలెక్టరేట్ (కాకినాడ), అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తుని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున బాలింత మృతి చెందడంపై విచారణ చేపట్టాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలన్నారు. తుని ఏరియా ఆసుపత్రిలో వైద్యుల లోపాలపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.