కొడుకుపై తల్లి ఫిర్యాదు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:57 PM
అమలాపురం రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కొబ్బరికాయలు దొంగిలించాడని కుమారుడిపై తల్లి చేసిన ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరూరుకు చెందిన దూడల సత్యవతికి అదే గ్రామంలో 2ఎకరాల కొబ్బరి తోట ఉంది
కొబ్బరికాయలు దొంగిలించాడని కేసు
అమలాపురం రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కొబ్బరికాయలు దొంగిలించాడని కుమారుడిపై తల్లి చేసిన ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరూరుకు చెందిన దూడల సత్యవతికి అదే గ్రామంలో 2ఎకరాల కొబ్బరి తోట ఉంది. తోటలో కొడుకు సత్తిపండు స్నేహితులతో కలసి కొబ్బరిదింపు తీసి 6వేల కాయలు తరలించుకుపోయాడని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు.