తల్లీకూతూరు సాధించారిలా!
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:13 AM
కాకినాడ/జీజీహెచ్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తల్లి, తనయ ఇద్దరూ ఒకేసారి ఏపీ హై కోర్టు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్న అరుదైన ఘటన కాకినాడలో జరిగింది. కాకినాడ రామారావుపేటకు చెం దిన మల్లిపూడి మెహెరానీ, ఆమె కుమార్తె లక్ష్మీ ఐశ్వర్య ఇద్దరూ న్యాయ విద్యనభ్యసించి.. న్యాయవాదులుగా హైకోర్టు బార్ కౌన్సిల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మెహరానీకి చిన్నప్పటి నుంచీ చదువంటే ప్రాణం. న్యా
హైకోర్టు బార్ కౌన్సిల్‌లో తల్లీతనయలకు ఒకేసారి సభ్యత్వం
కాకినాడ/జీజీహెచ్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తల్లి, తనయ ఇద్దరూ ఒకేసారి ఏపీ హై కోర్టు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్న అరుదైన ఘటన కాకినాడలో జరిగింది. కాకినాడ రామారావుపేటకు చెం దిన మల్లిపూడి మెహెరానీ, ఆమె కుమార్తె లక్ష్మీ ఐశ్వర్య ఇద్దరూ న్యాయ విద్యనభ్యసించి.. న్యాయవాదులుగా హైకోర్టు బార్ కౌన్సిల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మెహరానీకి చిన్నప్పటి నుంచీ చదువంటే ప్రాణం. న్యాయవాదిగా మా రాలనేది ఆమె సంకల్పం. తొలుత బీఎస్సీ డిగ్రీ పూర్తి చేయాలనుకున్న ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేయడంతో అది నెరవేరలేదు. వివా హం అనంతరం ఆమె భర్త జీవీవీ సత్యనారాయణ ప్రోత్సాహంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ పూర్తి చేసింది. అనంతరం రాజీవ్‌గాంధీ లా డిగ్రీ కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరి.. తన కలను నెరవేర్చుకుంది. తనకు ఇష్టమైన న్యాయవాది డిగ్రీ పట్టా పొందింది. ఇక మరోవైపు తల్లి మెమెరానీ లాగే తనయ లక్ష్మీ ఐశ్వర్య కూ డా న్యాయవాద వృత్తినే ఎంచుకుంది. ఆమె ఒడిశాలోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి బీబీఏ ఎల్ ఎల్‌బీ (ఆనర్స్) పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో ఎల్‌ఎ ల్‌ఎం చదువుతోంది. దీంతో తల్లీకుమార్తెలు ఇద్దరూ ఒకే రోజున రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్‌లో సభ్యులుగా చేరారు. తన భర్త సత్యనారాయణ (ఏసీబీ సర్కిల్ ఇన్‌స్పెకర్), కుటుంబసభ్యుల సహకారంతో ఇది సాధ్యమైందని మెహరానీ ‘ఆంధ్ర జ్యోతి’కి చెప్పారు. వారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు అభినందించారు.