నూతన పద్ధతులతో అఽధిక దిగుబడులు
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:11 AM
నేల లు, వాటిని సారవంతం చేసే విభిన్న పద్ధతుల శాస్త్రీయ అధ్యయనంతో నాణ్యమైన, అధిక దిగు బడులు సాధించవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పనిచేసే ప్రాథమిక వ్యవసాయ పరపతి సం ఘం ప్రతినిధులకు సమగ్ర పోషక యాజమా న్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సు శిక్షణా కార్యక్రమం దివాన్‌చెరువులోని ఏరు వాక కేంద్రంలో సోమవారం జరి గింది.

ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ నరసింహారావు.. సొసైటీ ప్రతినిధులకు శిక్షణ
దివాన్‌చెరువు, జూన్ 9(ఆంధ్రజ్యోతి): నేల లు, వాటిని సారవంతం చేసే విభిన్న పద్ధతుల శాస్త్రీయ అధ్యయనంతో నాణ్యమైన, అధిక దిగు బడులు సాధించవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పనిచేసే ప్రాథమిక వ్యవసాయ పరపతి సం ఘం ప్రతినిధులకు సమగ్ర పోషక యాజమా న్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సు శిక్షణా కార్యక్రమం దివాన్‌చెరువులోని ఏరు వాక కేంద్రంలో సోమవారం జరి గింది. ఈ సందర్భంగా నరసింహా రావు మాట్లాడుతూ 15 రోజుల శిక్షణలో వివిధ శాస్త్రవేత్తలతో నేల లు, నేల ఫలదత, ఎరువుల వాడ కం, సమస్యాత్మక భూముల సవ రణ, జీవ ఎరువులు వంటి పలు అంశాలపై శిక్షణ కల్పించబడుతుం దన్నారు. తొలిరోజు శిక్షణలో ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ నేలలు, రకా లు, వివిధ పంటలకు అవసరమయ్యే పోషకా లపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, జిల్లా సహకార సంఘం అధికారి జగన్నాధరెడ్డి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారి భారతి, జిల్లా వనరుల ఏడీఏ ఎస్.జ యరామలక్ష్మి, వివిధ పరపతి సంఘ ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.