ప్రజలపై కొండముచ్చు దాడి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:25 AM
అయినవిల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో గత కొన్నిరోజులుగా ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న కొండముచ్చును అటవీశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఆరు నెలల నుంచి మాగాం
మాగాంలో బంధించిన అటవీశాఖాధికారులు
అయినవిల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో గత కొన్నిరోజులుగా ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న కొండముచ్చును అటవీశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఆరు నెలల నుంచి మాగాం గ్రామంలో కొండముచ్చు నివసిస్తుంది. గ్రామస్తులు దానికి ఆహారం పెడుతున్నారు. గత రెండు రోజుల నుంచి ఒంటరిగా ఉన్న వ్యక్తులపై కొండముచ్చు దాడి చేసి గాయపరుస్తుంది. ఐదుగురు కొండముచ్చు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులు స్థానిక పంచాయతీ అధికారులు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులు కొండముచ్చును బోనులో బంధించారు. అటవీ ప్రాంతంలో వదిలి వేస్తామని వారు తెలిపారు.