Share News

బాణసంచా పేలుడు ఘటనలో బాధితులకు రూ.కోటి 50 లక్షల చెక్కు అందజేత

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:39 AM

అమలాపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో శ్రీలక్ష్మీగణపతి గ్రాండ్‌ ఫైర్‌వర్క్స్‌లో ఈ నెల 8న జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహే

బాణసంచా పేలుడు ఘటనలో బాధితులకు రూ.కోటి 50 లక్షల చెక్కు అందజేత
చెక్కును కార్మికశాఖ సహాయ కమిషనర్‌కు అందిస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో శ్రీలక్ష్మీగణపతి గ్రాండ్‌ ఫైర్‌వర్క్స్‌లో ఈ నెల 8న జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ చేతులమీదుగా రూ.కోటి 50లక్షల చెక్కును కోనసీమ సహాయ కార్మిక కమిషనర్‌కు బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సంఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు. పేలుడు వల్ల మరణించిన వారికుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఏపీ కార్మికశాఖ సంక్షేమ మండలి కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కార్మికశాఖ కమిషనర్‌ రూ.కోటి 50లక్షల చెక్కును జిల్లా కలెక్టర్‌ పేరున అందజేశారు. ఏపీ దుకాణాలు, సంస్థల చట్టం కింద నమోదైన సంస్థల్లో పనిచేసే కార్మికులకు కార్మిక సంక్షేమ మండలినందు రూ.100 వంతున వెల్ఫేర్‌ ఫండ్‌ చెల్లించడం జరుగుతుంది. యజమాని వాటా రూ.70, కార్మికుని వాటా రూ.30 చొప్పున చెల్లిస్తారు. దీని ద్వారా సంక్షేమ పథకాలు అందించేవారు. అయితే ఈ పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ కోనసీమ కలెక్టర్‌ చొరవతో రాయవరం ఘటన బాధితులకు రూ.కోటి 50లక్షలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా సహాయ కార్మిక కమిషనర్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:39 AM